ETV Bharat / sitara

పెళ్లైన వ్యక్తితో ప్రేమలో పడొద్దు : నీనా గుప్తా - వివాహమైన వ్యక్తులతో ప్రేమలో పడకండంటూ

బాలీవుడ్​ సీనియర్​ నటి నీనా గుప్తా ఇన్​స్టా వేదికగా తన అభిమానులతో ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. వివాహమైన వ్యక్తులతో ప్రేమలో పడకండంటూ ఓ వీడియోను ఇన్​స్టా వేదికగా పోస్ట్​ చేసింది.

Don't fall in love with a married man
పెళ్లైన వ్యక్తితో ప్రేమలో పడొద్దు
author img

By

Published : Mar 3, 2020, 8:49 PM IST

వివాహమైన వ్యక్తులతో ప్రేమలో పడొద్దు అంటుంది ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా. ప్రస్తుతం విహారయాత్ర కోసం ఉత్తరాఖండ్‌లోని ముక్తేశ్వర్‌లో ఉన్న ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 'నిజం చెప్పాలంటే..' అనే పేరుతో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తన గత జీవిత అనుభవాలతో పాటు, తన ప్రేమకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

"ఒకప్పుడు నేను వివాహమైన వ్యక్తితో సంబంధం పెట్టుకున్నాను. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ఆ వ్యక్తి భార్యకు తెలియజేయాలని అనుకున్నాను. అయితే కొంత కాలం తర్వాత గొడవల కారణంగా ఆ వ్యక్తితో విడిపోయాను. చివరగా నిజం చెప్పాలంటే వివాహమైన వ్యక్తులతో రిలేషన్‌ పెట్టుకోకూడదు"

-నీనా గుప్తా, బాలీవుడ్​ నటి.

నీనా గుప్తా తన వ్యక్తిగత జీవితం గురించిన విషయాలను పలు సందర్భాల్లో బహిరంగంగానే వెల్లడించింది. వెస్టిండీస్ మాజీ క్రికెటర్‌ వీవ్‌ రిచర్డ్స్‌, నీనా కొంతకాలం ప్రేమించుకున్నారు. వీరిద్దరికీ ఓ బిడ్డ కూడా జన్మించింది. తను ప్రముఖ డిజైనర్ మసాబా గుప్తా. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల నీనా, వీవ్‌ విడిపోయి వేర్వేరుగా వివాహాలు చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందే బిడ్డకు జన్మనివ్వడం వల్ల సమాజంలో తనపై ప్రతికూల ప్రభావం పడిందని నీనా ఓ సందర్భంలో తెలిపింది. చివరిగా 'శుభ్‌ మంగళ్‌ జ్యాదా సావ్‌ధాన్‌' అనే బాలీవుడ్‌ చిత్రంలో నటించింది.

ఇదీ చూడండి : చందమామే పక్కనుంటే అది షాలినీలానే ఉంటుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.