15 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన కార్తీ.. తిరిగి ఇంటికొస్తాడు. అయితే అతడితో అందరూ అంటిముట్టనట్లుగానే ఉంటారు. అలాంటి సమయంలో జరిగిన ఓ సంఘటన తర్వాత ఆ కుటుంబంలో ఎదురైన పరిస్థితులు ఏంటి? ఏం జరిగింది? తదితర అంశాలతో రూపొందిన చిత్రం 'దొంగ'(తమిళంలో తంబి). మంగళవారం ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం.
ఈ సినిమాలో కార్తీకి అక్క పాత్రలో జ్యోతిక, తండ్రిగా సత్యారాజ్, హీరోయిన్గా నిఖిలా విమల్, విలన్గా ఉన్ని ముకుందన్ నటించారు. 'దృశ్యం' ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
"చిన్నా.. ఇంకా నా కళ్లల్లోనే ఉన్నాడు. నాకు ఇక్కడ ఉన్న ఒక్క సంతోషం, ఓదార్పు వాడు మాత్రమే", "న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి. ఎవరెవరినో పెడుతున్నారు", "సడెన్గా తమ్ముడంటే ఎత్తుకొని ఆడించమంటారా", "ఇంట్లో ఒక అక్క ఉంది. ఇద్దరు అమ్మలతో సమానం. అది ఎవరికి తెలియకపోయినా.. నాకు తెలుస్తుంది అక్కా" వంటి డైలాగ్లు అలరిస్తున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">