ETV Bharat / sitara

'హీరోయిన్​తో ఎప్పుడూ ముగ్గురు, నలుగురు..' - నేహా శెట్టి

DJ Tillu: 'డీజే టిల్లు' పాత్ర హీరో సిద్ధులోనే కనిపించిందని చెప్పారు ఆ చిత్ర దర్శకుడు విమల్‌కృష్ణ. ప్రచార చిత్రాలు, పాటలతో ఆసక్తిరేపిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో సినిమా గురించిన పలు విశేషాలను పంచుకున్నారు విమల్.

dj tillu
డీజే టిల్లు
author img

By

Published : Feb 8, 2022, 7:54 AM IST

DJ Tillu: "దర్శకుడిగా తొలి సినిమాతోనే నాదైన ప్రభావం చూపించాలనే ప్రయత్నంలో భాగంగానే 'డి.జె.టిల్లు' కథని తెరకెక్కించా" అన్నారు విమల్‌కృష్ణ. ఆయన దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటించిన చిత్రం 'డి.జె.టిల్లు'. నేహాశెట్టి కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థతో కలిసి సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా విమల్‌కృష్ణ సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ..

dj tillu
డైరెక్టర్ విమల్‌ కృష్ణ
  • "ఇదివరకు నేను ఒకట్రెండు సినిమాల్లో నటించా. లఘు చిత్రాలు చేశా. క్రికెట్‌ ఆడాను. ఎన్ని చేసినా నా ఆలోచన ఎప్పుడూ కథలు చెప్పడంపైనే ఉండేది. నేను, దర్శకుడు రవికాంత్‌ పేరేపు, ఆదిత్య సహాధ్యాయిలం. మేం కలిసే చిత్ర పరిశ్రమకి వచ్చాం. 'కృష్ణ అండ్‌ హిజ్‌ లీల' చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశా. ఆ సమయంలోనే నేను 'డి.జె.టిల్లు' కథని రాసుకున్నా. 'కృష్ణ అండ్‌ హిజ్‌ లీల' తర్వాత నిర్మాత నాగవంశీ సిద్ధుకి ఫోన్‌ చేసి అభినందించాక, మంచి కథలు ఉంటే చేద్దాం అని చెప్పారట. సిద్ధుకి నేను రాసుకున్న కథ తెలుసు. అలా మేమిద్దరం వెళ్లి 'డి.జె.టిల్లు' కథ చెప్పాం. ఆయనకి బాగా నచ్చింది.
    dj tillu
    'డి.జె.టిల్లు'
  • మొదట ఈ కథకి 'నరుడి బ్రతుకు నటన' అనే పేరు అనుకున్నాం. అది సీరియస్‌గా ఉందనిపించడం సహా ఇది డీజే టిల్లు కథ కాబట్టి తన పేరునే ఖరారు చేశాం. కల్పిత కథే ఇది. నాలోనూ, ఇంకా చాలా మందిలోనూ టిల్లు ఉండొచ్చు కానీ.. నాకు ఎక్కువగా సిద్ధులోనే కనిపించాడు. తనైతే ఈ కథకి బాగుంటాడని ముందే అనుకున్నా. పైగా తను మల్కాజ్‌గిరిలో పుట్టి పెరిగిన కుర్రాడు కాబట్టి ఆ పాత్రని చాలా బాగా చేశాడు".
    dj tillu
    సిద్ధు
  • "నేను కథ రాసినా, సంభాషణల విషయంలో సిద్ధు పాత్రే ఎక్కువ. మేమిద్దరం కలిసి రాసుకున్నాం. నేనూ, తను సినిమాని చూసే విధానం ఒకేలా ఉంటుంది. మా ఆలోచనలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. ఈ స్క్రిప్టు తయారు చేసేటప్పుడు తన మాటల్లో నుంచే కొన్ని తీసుకున్నాం. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తూ ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచుతుంది. కథలో భాగంగా పుట్టే హాస్యంతోనే, ఎక్కడా గీత దాటకుండా అందరికీ నచ్చేలా సినిమాని తెరకెక్కించాం. నా దగ్గర మూడు నాలుగు కథలు సిద్ధంగా ఉన్నప్పటికీ.. దర్శకుడిగా ప్రేక్షకుల దృష్టిని వెంటనే ఆకర్షించేలా చేయగలిగే కథ ఇదేనని నమ్మి దీన్ని తెరకెక్కించా.
    dj tillu
    'డి.జె.టిల్లు'
  • ఇందులో కథానాయిక చుట్టూ ఎప్పుడూ ముగ్గురు నలుగురు అబ్బాయిలు కనిపిస్తుంటారు. అమ్మాయిల పక్కన అబ్బాయిలు ఉన్నారంటే వాళ్లని మనం చూసే కోణమే వేరుగా ఉంటుంది. అది తప్పు కదా, ఆ అబ్బాయిలు సోదరులు కావొచ్చు, స్నేహితులు కావొచ్చు. ఈ అంశాన్ని ఇందులో స్పృశించాం. అలాగని దీన్నొక సందేశంలా కాకుండా.. వినోదాత్మకంగానే చెప్పాం. ట్రైలర్‌ విడుదలైన తర్వాత ముగ్గురు నిర్మాతలు ఫోన్‌ చేసి సినిమా చేద్దామని ముందుకొచ్చారు. ఆ వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తా".
    dj tillu
    నేహా శెట్టి

ఇదీ చూడండి: హృతిక్​ రోషన్​ వల్ల దానిపై ఆసక్తి పెరిగింది: నేహా శెట్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.