బాలీవుడ్ హాట్ హీరోయిన్ దిశా పటానీ.. మరో యాక్షన్ సినిమాలో నటించే అవకాశం కొట్టేసిందట. 2014లో వచ్చిన 'ఏక్ విలన్' సీక్వెల్గా మరో చిత్రాన్ని ప్రస్తుతం తీస్తున్నారు. ఇందులో కథానాయికగా దిశాను ఎంపిక చేసుకున్నారని టాక్. ఇటీవలే మాట్లాడిన దర్శకుడు మోహిత్సూరి.. ఇదే విషయంపై పరోక్షంగా హింట్ ఇచ్చాడు.
![Disha Patani](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6289014_disha-2.jpg)
"ఆమె నా సినిమాలో హీరో. హీరోలు ఎలాంటి యాక్షన్ సన్నివేశాలు చేస్తారో, అలాగే తానూ పోరాట సన్నివేశాల్లో నటిస్తానంది. 'మలాంగ్'కు కలిసి పనిచేసేటప్పుడు దిశా పటానీలోని నటనను దగ్గర్నుంచి గమనించా" -మోహిత్ సూరి, దర్శకుడు
'ఏక్ విలన్' సీక్వెల్లో ఆదిత్యరాయ్ కపూర్, జాన్ అబ్రహం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మాతృకను రూపొందించిన మోహిత్నే దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు దిశా పటానీ.. సల్మాన్ ఖాన్ 'రాధే', టైగర్ష్రాఫ్ 'బాఘీ 3'లో నటిస్తూ బిజీగా ఉంది.
ఇది చదవండి: స్పెషల్: వెండితెర టైమ్ మిషన్స్ వచ్చేస్తున్నాయ్!