ETV Bharat / sitara

సింహాద్రి సినిమా రీమేక్​కు వినాయక్​ రెడీ! - ఛత్రపతి హిందీ రీమేక్

ఓటీటీల్లో అభ్యంతరకర కంటెంట్​ను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ అన్నారు. అయితే సృజనకు అన్ని అడ్డంకులు ఉండరాదని సినిమాటోగ్రఫీ చట్ట సవరణలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హిందీలో త్వరలోనే 'ఛత్రపతి' రీమేక్​ పట్టాలెక్కించబోతున్న సందర్భంగా వినాయక్​తో చిట్ చాట్.

vv vinayak movies
వివి వినాయక్
author img

By

Published : Jul 10, 2021, 7:06 AM IST

Updated : Jul 10, 2021, 8:45 AM IST

తెలుగు సినిమాల్లో యాక్షన్‌ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుడు వి.వి.వినాయక్‌. ఫ్యాక్షన్‌ కథలతో ఒక కొత్త ట్రెండ్‌ని సృష్టించారు. మాస్‌ నాడి పట్టి స్టార్‌గా ఎదిగిన అతి కొద్దిమంది దర్శకుల్లో ఈయన ఒకరు. మంచి కథ దొరికిన ప్రతిసారీ దర్శకుడిగా తన సత్తాని చాటుతుంటారు. ప్రస్తుతం 'ఛత్రపతి' సినిమాని హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. త్వరలోనే ఇది పట్టాలెక్కనున్న సందర్భంగా వి.వి.వినాయక్‌తో 'ఈనాడు సినిమా' ముచ్చటించింది.

vv vinayak movies
వి.వి. వినాయక్
  • తొలిసారి హిందీలో సినిమా చేస్తున్నారు. ఆ అనుభవం ఎలా ఉంది?

చాలా కొత్త అనుభవం. అక్కడంతా ఒక పద్ధతి, సమయం ప్రకారం పనులు జరుగుతుంటాయి. ప్రతీ సినిమాకీ ఒక లైన్‌ ప్రొడ్యూసర్‌ ఉంటాడు. అతని ప్రణాళికల ప్రకారం అందరం పనిచేయాల్సి ఉంటుంది. హిందీలో సినిమా అంటే ఆ ప్రాజెక్ట్‌ స్థాయి పెరుగుతుంది. మన ఆలోచనల్ని మరింత భారీగా చూసుకొనే అవకాశం ఉంటుంది. 'ఛత్రపతి' రీమేక్‌ స్థాయి చాలా పెద్దగా ఉంటుంది. హిందీలో పేరు మోసిన సంస్థ పెన్‌ స్టూడియోస్‌. జయంతిలాల్‌ గడ నిర్మాణంలో చేస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఈ నెల 15 నుంచి హైదరాబాద్‌లోనే చిత్రీకరణ మొదలు పెడతాం.

  • మన శైలి కథలకి హిందీలో మంచి ఆదరణ లభిస్తుంటుంది కదా..?

హిందీలో డబ్‌ అయ్యే మన సినిమాల్ని అంతర్జాలంలో విశేషంగా ఆదరిస్తుంటారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సినిమాల్ని హిందీ ప్రేక్షకులు భలే చూస్తుంటారు. అది గమనించే జయంతిలాల్‌ గడ హిందీలో ఈ సినిమా చేయాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆయన దగ్గరే 'ఛత్రపతి' రీమేక్‌ హక్కులు ఉన్నాయి. హిందీలో సాయిశ్రీనివాస్‌కి ఉన్న ఆదరణని గమనించే తనతో చేయాలనుకున్నారు. ఆ తర్వాత నన్ను సంప్రదించారు. మంచి సినిమా కాబట్టి నేనూ చేయాలని నిర్ణయించుకున్నా.

  • స్క్రిప్ట్‌లో చేసిన మార్పులేంటి?

రచయిత విజయేంద్రప్రసాద్‌ సర్‌ హిందీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. మేం అంతా ఒక బృందంగా కూర్చుని స్క్రిప్ట్‌ కోసం పనిచేశాం. రాజమౌళి 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' సినిమా విషయంలో బిజీగా ఉన్నారు. అందుకే కలవలేదు. తర్వాత ఎప్పుడైనా కూర్చుంటాం.

  • రీమేక్‌ కోసం రాజమౌళి సినిమాల్లో ఏదైనా ఎంపిక చేసుకోమని చెబితే దేన్ని ఎంచుకుంటారు?
    vv vinayak movies
    'సింహాద్రి' చిత్రం

నేనైతే 'సింహాద్రి'ని ఎంచుకునేవాణ్ని. అదొక గొప్ప కథ, చాలా మంచి స్క్రిప్ట్‌.

  • హీరోయిజంతో పాటు.. కామెడీపై అంతే పట్టు ప్రదర్శిస్తుంటారు. దీని వెనక రహస్యం?

హీరోయిజం, కామెడీ, పాటలు.. ఇవన్నీ మాస్‌ అంశాలే. ఇవి ఎంత బలంగా ఉంటే.. సినిమా అంత ఎక్కువ మందికి చేరువవుతుంది. ఏం చేయాలన్నా సరే, మంచి కథతోనే సాధ్యం. అది ఉందంటే ఏదైనా చేయగలం అంతే.

  • ఇటీవల సినిమాటోగ్రఫీ చట్టంలో చేసిన సవరణలపై మీ అభిప్రాయం?

ఈ సవరణల గురించి విన్నాను. సృజనకి అన్ని అడ్డంకులు ఉండకూడదు. ముందు ఓటీటీ నుంచి వచ్చే ఇబ్బందికరమైన కంటెంట్‌ని ఆపాలి కానీ, సినిమాల్లో ఘోరాలు ఏమీ ఉండవు కదా. సెన్సార్‌ అయిన తర్వాత ఎవరో ఒకరు ఏదో ఒక అభ్యంతరం లేవనెత్తుతారు. అప్పుడు మళ్లీ సెన్సార్‌ చేస్తాం అంటే నిర్మాత ఏమైపోవాలి. అది ఎంత మాత్రం సరైంది కాదు.

  • సినిమాల మధ్య విరామం ఎక్కువగా తీసుకుంటుంటారు ఎందుకు?

ఏదో అనుకోవడం, అది కరెక్ట్‌గా రాకపోవడం.. మధ్యలో నిర్మాత దిల్‌రాజు 'శీనయ్య' సినిమాతో రావడం, అదీ సరిగ్గా రాకపోవడం.. అలా అలా సమయం గడిచిపోయింది. ఇక నుంచి వేగంగా సినిమాలు చేయాలనే ప్రణాళికలు ఉన్నాయి. 'ఛత్రపతి' రీమేక్‌ తర్వాత పెన్‌ స్టూడియోస్‌లోనే పని చేయాలి. అది ఏమిటనేది మళ్లీ చెబుతా.

  • అన్ని విభాగాలకూ ఇబ్బంది..

"కరోనాతో చిత్రసీమ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ప్రదర్శన రంగం నుంచి నిర్మాణం వరకు అన్ని విభాగాలూ ఇబ్బంది పడుతున్నాయి. దర్శకులు, నిర్మాతలు.. అందరూ భవిష్యత్తు గురించి అయోమయంగా ఉన్నారు. రెండో దశ లాక్‌డౌన్‌ సమయం మొత్తం స్క్రిప్ట్‌, చర్చలకే సరిపోయింది. ఖాళీ సమయాల్లో నేనెక్కువగా సినిమాలే చూస్తుంటాను. వెబ్‌ సిరీస్‌లూ చూస్తున్నా. ప్రస్తుతానికి నాకైతే వెబ్‌సిరీస్‌లు చేసే ఆలోచన లేదు కానీ, భవిష్యత్తులో హిందీలో ఏదైనా చేయాలంటే చేస్తానేమో తెలియదు."

ఇదీ చూడండి: Allu Arha: అల్లు అర్జున్ కుమార్తె సినిమాల్లోకి!

Last Updated : Jul 10, 2021, 8:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.