అక్కినేని హీరో నాగ చైతన్యతో కలిసి దర్శకుడు విక్రమ్ కుమార్ మరో సినిమా తెరకెక్కించనున్నారు. 'మనం' తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే ఈ సినిమాకు దిల్‌రాజు నిర్మాత. లాక్డౌన్ అనంతరం ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచి సినిమాపై అనేక ఊహాగానాలు వినిపించాయి. గతంలో విక్రమ్ తెరకెక్కించిన '13 బి' సీక్వెల్‌గా హారర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందని వార్తలు వచ్చాయి. అయితే, ఇటువంటి పుకార్లకు స్వస్తి పలుకుతూ.. చైతన్యతో చిత్రీకరించనున్న సినిమా హారర్ థ్రిల్లర్ కాదని దర్శకుడు విక్రమ్ కుమార్ స్పష్టం చేశారు. మంచి రొమాంటిక్, ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్‌స్టోరీ' చేస్తున్నారు నాగచైతన్య. ఇది పూర్తయిన తర్వాత 'గీతగోవిందం' ఫేమ్ పరశురామ్‌తో కలిసి పనిచేయనున్నారు. దీనికి 'నాగేశ్వరరావు' అనే టైటిల్ అనుకుంటున్నారు.
ఇదీ చూడండి:చైతూను శేఖర్‌కమ్ముల చంపేయబోతున్నాడా..?