'వకీల్‌సాబ్' చిత్రం కంటే ముందే కథానాయకుడు పవన్ కల్యాణ్‌తో కలిసి పనిచేశానని డైరెక్టర్ వేణు శ్రీరామ్ వెల్లడించారు. గతంలో ఓ శీతల పానీయాల యాడ్ కోసం సహాయ దర్శకుడిగా పనిచేశానని అన్నారు. పవన్‌ను కలిసిన మొదటి రోజున ఆయన ఇదే విషయం గుర్తు చేశారని ఓ ఛానెల్‌తో జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు.
దిల్‌రాజు వల్లే ఈ అవకాశం
నిర్మాత దిల్‌రాజు వల్లే తనకు 'వకీల్‌సాబ్'ను తీసే అవకాశం దక్కిందని వేణు శ్రీరామ్ చెప్పారు. ఈ సినిమాకు తన పేరును త్రివిక్రమ్ సిఫారసు చేశారని, ఆ తర్వాత పవన్ దానికి అంగీకరించారని అన్నారు.
పవర్‌స్టార్‌తో తొలిరోజు షూటింగ్
'వకీల్‌సాబ్' షూటింగ్ మొదలైన రోజు, తాను ఓ పవర్‌స్టార్‌ను డైరెక్ట్ చేస్తున్నట్లు భావించలేదని వేణు శ్రీరామ్ అన్నారు. నిర్దేశించిన సమయంలోనే చిత్రీకరణ పూర్తిచేయాలనే ఉద్దేశం తప్ప మరో ఆలోచన లేదని చెప్పారు. 'వకీల్‌సాబ్' ఫస్ట్‌లుక్, తాను తీసిన తొలి షాట్ అని, తొలి రోజంతా షూటింగ్ పూర్తయిన తర్వాత గొప్పగా అనిపించిందని తెలిపారు.
నేటివిటీకి తగ్గట్టు మార్పులు
'వకీల్‌సాబ్' చిత్రీకరణ ప్రారంభంలో పవన్, ప్రతిరోజూ విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేవారని.. షూటింగ్ ఎప్పుడంటే ఆ సమయంలో సెట్లో ఉండేవారని వేణు శ్రీరామ్ తెలిపారు. కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్వల్ప మార్పులు చేశామని వెల్లడించారు. ఈ సినిమాలోని 'మగువా మగువా' పాటను పెట్టాలనే ఆలోచనను పవన్‌కు సూచించినప్పుడు ఆయన మెచ్చుకున్నారని వెల్లడించారు. ఈ సినిమాలో స్త్రీ ప్రాధాన్యాన్ని వివరించామని ఈ దర్శకుడు పేర్కొన్నారు. ఇందులో మొత్తం ఐదు పాటలు ఉంటాయని స్పష్టం చేశారు.
అల్లుఅర్జున్ సినిమా పక్కనపెట్టి!
'వకీల్‌సాబ్' కంటే ముందు అల్లుఅర్జున్‌తో సినిమా తీసేందుకు చర్చలు జరిగాయని దర్శకుడు వేణు శ్రీరామ్ తెలిపారు. అనూహ్యంగా పవన్ సినిమా దర్శకత్వం వహించే అవకాశం రావడం వల్ల ఆ ప్రాజెక్టును తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు చెప్పారు. ఇదే విషయాన్ని అల్లు అర్జున్‌కు చెబితే అతడు సానుకూలంగా స్పందించారని అన్నారు. పవర్‌స్టార్‌తో సినిమా చేయాలనేది తనతో పాటు దిల్‌రాజుకు కల అని.. 'వకీల్‌సాబ్'తో అది నెరవేరిందని వేణు శ్రీరామ్ ఆనందం వ్యక్తం చేశారు.