ETV Bharat / sitara

తారక్​ను కలిసిన త్రివిక్రమ్.. త్వరలో సినిమా షురూ - ఎన్టీఆర్, త్రివిక్రమ్ కొత్త చిత్రం

ఎన్టీఆర్​, త్రివిక్రమ్ కాంబోలో రానున్న రెండో సినిమా త్వరలో ప్రారంభం కానుంది. న్యూయర్​ సందర్భంగా వీరిద్దరూ కలిశారు. ఆ ఫొటోను నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ట్వీట్ చేసింది.

director trivikram met jr.ntr on new year eve
అప్​డేట్​: త్వరలోనే త్రివిక్రమ్​, తారక్ కాంబోలో​ చిత్రం
author img

By

Published : Jan 2, 2021, 2:24 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌, జూ.ఎన్టీఆర్‌ కాంబినేషన్​లో మరో సినిమా రానుందని ఇదివరకే ప్రకటించారు. చాలా రోజులుగా దానికి సంబంధించి ఎలాంటి సమాచారం​ లేనందున ఆ చిత్రం ఎప్పుడు మొదలవుతుందా అనే అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు వారికోసం శనివారం ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది చిత్రబృందం.

"కొత్త ఏడాది రెండో రోజు.. యంగ్​టైగర్ ఎన్టీఆర్, ప్రియమైన దర్శకుడు త్రివిక్రమ్​ కలిశారు. 'ఎన్టీఆర్ 30' త్వరలోనే ప్రారంభం కానుంది" అని నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ట్వీట్​ చేసింది.

'ఎన్టీఆర్​ 30'ని హారిక హాసినీ క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం గురించి గతేడాది ఫిబ్రవరిలోనే ప్రకటించినా కరోనా కారణంగా ఎలాంటి అప్‌డేట్‌ వెల్లడించలేదు. 'అరవింద సమేత' తర్వాత ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తుండటం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రీకరణతో తారక్ బిజీగా ఉన్నారు‌.

ఇదీ చూడండి: 'బుట్టబొమ్మ' స్టెప్పులేసిన ఎయిర్​పోర్ట్ సిబ్బంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.