ETV Bharat / sitara

20 ఏళ్ల తర్వాత 'చిత్రం'కు సీక్వెల్.. తేజ ప్రకటన - movie news

యూత్​ఫుల్ ఎంటర్​టైనర్​ 'చిత్రం'కు సీక్వెల్​ ప్రకటించారు దర్శకుడు తేజ. సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా పోస్టర్​ను కూడా విడుదల చేశారు.

Director Teja announces sequel to 'chitram' movie
20 ఏళ్ల తర్వాత 'చిత్రం'కు సీక్వెల్.. తేజ ప్రకటన
author img

By

Published : Feb 22, 2021, 3:14 PM IST

Updated : Feb 22, 2021, 3:27 PM IST

తన సినిమాలతో ఎంతోమంది కొత్తవారిని టాలీవుడ్​కు పరిచయం చేసిన తేజ.. ప్రముఖ దర్శకుడిగా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. చివరగా 'నేనే రాజు నేనే మంత్రి'తో హిట్​ కొట్టిన ఆయన.. హీరోలు రానా, గోపీచంద్​తో వేర్వేరుగా చిత్రాలు చేయనున్నారు. వీటితో పాటే తన తొలి సినిమా 'చిత్రం'కు సీక్వెల్​ ఉంటుందని ప్రకటించారు. 'చిత్రం 1.1' పేరుతో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టు షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది.

sequel to 'chitram' movie
'చిత్రం' సీక్వెల్ పోస్టర్

స్వతహాగా కెమెరామ్యాన్ అయిన తేజ.. 2000లో 'చిత్రం'తో డైరెక్టర్​గా మారారు. ఉదయ్ కిరణ్, రీమాసేన్​లను హీరోహీరోయిన్లుగా, ఆర్పీ పట్నాయక్​ను సంగీత దర్శకుడిగా ఈ సినిమాతోనే పరిచయం చేశారు. ఇప్పుడు దానికి సీక్వెల్​ 'చిత్రం 1.1'ను తన పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు. నటీనటులతో పాటు పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు.

Last Updated : Feb 22, 2021, 3:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.