ETV Bharat / sitara

బుల్లితెరపై 'నీకు మాత్రమే చెప్తా'నంటున్న తరుణ్​ - మార్చి 14నుంచి ప్రతి శనివారం రాత్రి 9గంటలకు ఈటీవీ ప్లస్​లో నీకు మాత్రమే చెప్తా

దర్శకుడిగా, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు తరుణ్​ భాస్కర్​. తాజాగా 'నీకు మాత్రమే చెప్తా' అనే బుల్లితెర కార్యక్రమంతో వ్యాఖ్యాతగా కనువిందు చేయనున్నాడు. ఈ కార్యక్రమం మార్చి 14 నుంచి ప్రతి శనివారం రాత్రి 9గంటలకు ఈటీవీ ప్లస్​లో ప్రసారం కానుంది.

tarun
బుల్లితెరపై 'నీకు మాత్రమే చెప్తా'నంటున్న తరుణ్​
author img

By

Published : Mar 4, 2020, 5:14 PM IST

విజయ్​దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'పెళ్లి చూపులు' సినిమాతో అందరిచూపును అతనివైపు తిప్పుకున్నాడు దర్శకుడు తరుణ్​ భాస్కర్​. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో జాతీయ అవార్డును అందుకుని ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు భాస్కర్​. అనంతరం 'ఈ నగరానికి ఏమైంది' చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమాకు మిశ్రమ స్పందనలు లభించాయి.

'మీకు మాత్రమే చెప్తా' నంటూ

ద‌ర్శ‌కుడిగా గ్యాప్ తీసుకుని 'మీకు మాత్ర‌మే చెప్తా' అంటూ వెండి తెరపై నవ్వులు పూయించాడు తరుణ్​. ఈ సినిమాకు విజ‌య్ దేవ‌ర‌కొండ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించాడు. 'ఫలక్​నుమా​ దాస్​', 'సమ్మోహనం' వంటి చిత్రాల్లో అతిథి పాత్రల్లో మెరిశాడు తరుణ్​.

'వాట్స్​ నెక్ట్స్'కు తెరదించాడు

ఈ సినిమాల తర్వాత తరుణ్​కు 'వాట్స్​ నెక్ట్స్​' అనే ప్రశ్న అభిమానులు, సినివర్గాల నుంచి ఎదురైంది. తాజాగా ఈ ప్రశ్నలకు తెరదించుతూ.. ఎవరూ ఊహించని విధంగా అభిమానుల ముందుకు బుల్లితెర వ్యాఖ్యాతగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. `నీకు మాత్ర‌మే చెప్తా` పేరుతో ఈటీవి ప్లస్​లో కనువిందు చేయనున్నాడు.

'నీకు మాత్రమే చెప్తా'

సాధారణంగా తరుణ్​... నటుడిగా కంటే దర్శకుడిగా తనను తాను చూసుకోవడానికి ఇష్టపడతాడు. ఇదే విషయాన్ని పలు కార్యక్రమాల్లో చెప్పుకొచ్చాడు. ఈ కార్యక్రమంలో.... సినిమాని తెరకెక్కించేటప్పుడు ప్రతి సన్నివేశాల చిత్రీకరణలో దర్శకుడికి ఎదురయ్యే అనుభవాలను సహా ఇంకా మరెన్నో విషయాలు ప్రేక్షకులతో పంచుకోనున్నాడు తరుణ్​.

ఈ కార్యక్రమం మార్చి 14నుంచి ప్రతి శనివారం రాత్రి 9గంటలకు ఈటీవీ ప్లస్​లో ప్రసారం కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి : ఆరేళ్ల వయసులోనే వేధింపులకు గురయ్యాను: నటి రష్మీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.