ప్రాణాంతక కరోనా వల్ల కనీసం మనిషిని మనిషి తాకొద్దంటున్నారు. అయితే ఈ వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు ఎలా తీస్తారోనని సందేహం వ్యక్తం చేశాడు బాలీవుడ్ దర్శకుడు సూజిత్ సర్కార్. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. దీనికి నెటిజన్లు, పలు ఫొటోలతో తమ సమాధానాన్ని చెబుతున్నారు.
'ప్రస్తుత పరిస్థితి సద్దుమణిగిన తర్వాత సినిమాల్లో ముద్దు సీన్లు, కౌగిలించుకునే సన్నివేశాలు ఎలా తీస్తారో చూడాలి. అవి తీసేటప్పుడు నటీనటుల మధ్య గ్యాప్ ఉండేలా చూసి, ఆ తర్వాత దగ్గరగా ఉన్నట్లు చూపిస్తారేమో?. అలా మోసం చేసయినా సరే కథలు చెప్పాల్సిందే' -ట్విట్టర్లో సూజిత్ సర్కార్
బాలీవుడ్లో 'విక్కీ డోనర్', 'మదరాస్ కెఫే', 'పీకూ', 'అక్టోబర్' వంటి సినిమాలతో సూజిత్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.