తమిళ దర్శకుడు శంకర్ అల్లుడిపై(shankar son in law name) పోలీసులు పోక్సో కేసు పెట్టారు. 17 ఏళ్ల అమ్మాయిని లైంగికంగా వేధించినందుకు శంకర్ అల్లుడితో పాటు పుదుచ్చేరి క్రికెట్ క్లబ్‌కు చెందిన మరో ముగ్గురిపై మెట్టుపాళ్యం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
క్రికెట్ కోచ్ తమరై కన్నన్(cricketer pocso case).. శిక్షణ కోసం వచ్చిన 17 ఏళ్ల అమ్మాయిని లైంగికంగా వేధించాడు. ఈ విషయమై క్రికెట్ బోర్డు అధికారులకు ఆ అమ్మాయి ఫిర్యాదు చేసింది. అయితే కోచ్‌ను మాత్రమే మార్చిన అధికారులు.. అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆ అమ్మాయి.. శిశు సంక్షేమ కమిటీకి ఫిర్యాదు చేయగా, దానిని మెట్టుపాళ్యం పోలీసులకు అప్పగించారు.
ఫిర్యాదులో భాగంగా కోచ్ తమరై కన్నన్‌తో పాటు మరో కోచ్ జయకుమార్, క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదరన్, సెక్రటరీ వెంకట్, జట్టు కెప్టెన్ రోహిత్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
కెప్టెన్ రోహిత్.. స్టార్ డైరెక్టర్ శంకర్(shankar movies list) కుమార్తె ఐశ్వర్యను జూన్ 27న చెన్నైలో వివాహం చేసుకున్నాడు.
ఇవీ చదవండి: