ETV Bharat / sitara

RGV Meets Perni Nani : ఏపీ మంత్రి పేర్ని నానితో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ భేటీ - పేర్ని నానితో ఆర్జీవీ భేటీ

RGV Nani Meet:
RGV Nani Meet:
author img

By

Published : Jan 10, 2022, 1:16 PM IST

Updated : Jan 10, 2022, 2:04 PM IST

13:14 January 10

RGV Meets Perni Nani : నా అభిప్రాయాలు చెప్పేందుకు వచ్చా: రామ్‌గోపాల్‌ వర్మ

నా అభిప్రాయాలు చెప్పేందుకు వచ్చా: రామ్‌గోపాల్‌ వర్మ

RGV Meets Perni Nani : ఆంధ్రప్రదేశ్‌ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సినిమా టికెట్‌ ధరల వ్యవహారంపై వీరిద్దరూ చర్చిస్తున్నారు. సినిమా టికెట్‌ ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆర్జీవీ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఇటీవల ఏపీ ప్రభుత్వం, మంత్రి పేర్ని నానిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘సినిమా టికెట్‌ ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదు’ అని ఆర్జీవీ కామెంట్‌ చేశారు. దీంతో నానీ-ఆర్జీవీల మధ్య కొన్ని రోజులపాటు ట్వీట్‌ వార్‌ జరిగింది. సమస్యను పరిష్కరించే విధంగా చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని వర్మ కోరడంతో మంత్రి పేర్ని నాని అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. దీంతో ఆయన నేడు మంత్రిని కలిశారు.

RGV and Perni Nani Meeting : 'సినీ పరిశ్రమ ప్రతినిధిగా వచ్చాను. నా అభిప్రాయాలు చెప్పేందుకు వచ్చాను. ఇతరుల వ్యాఖ్యలపై నేను స్పందించను.'

- రామ్​గోపాల్ వర్మ, సినీ దర్శకుడు

సంబంధిత కథనాలు

Last Updated : Jan 10, 2022, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.