ETV Bharat / sitara

'బాహుబలి' కాంబోలో మరో భారీ బడ్జెట్​ చిత్రం! - ప్రభాస్​తో రాజమౌళి

'బాహుబలి'తో అంతర్జాతీయ స్థాయిలో టాలీవుడ్‌ కీర్తి పతాకాన్ని ఎగరేశారు దర్శకధీరుడు రాజమౌళి. ఇందులో హీరోగా నటించిన ప్రభాస్​ అంతే స్థాయిలో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. వీరిద్దరి కాంబినేషన్​లో ఇప్పుడు మరో చిత్రం రూపొందనుందని సమాచారం. 2023 నాటికి ఈ ప్రాజెక్టును మొదలుపెట్టాలని రాజమౌళి యోచిస్తునట్లు టాలీవుడ్​లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

prabhas rajmouli
ప్రభాస్​
author img

By

Published : May 30, 2021, 5:35 PM IST

'బాహుబలి' కాంబో మరోసారి రిపీట్​ కానుందా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్​ వర్గాలు. 'బాహుబలి' చిత్రంతో తెలుగు సినీపరిశ్రమకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన దర్శకుడు రాజమౌళి.. ఇప్పుడు మరోసారి ప్రభాస్​తో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారట. మహేశ్​బాబుతో చిత్రం పూర్తయిన తర్వాతే రాజమౌళి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2023 నాటికి ప్రభాస్​తో సినిమాను మొదలుపెట్టాలని జక్కన్న యోచిస్తున్నట్లు సమాచారం.

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం 'ఆర్​ఆర్​ఆర్​' షూటింగ్​తో బిజీగా ఉన్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్​చరణ్​, కొమురం భీమ్​గా ఎన్టీఆర్​ కనువిందు చేయనున్నారు. ఈ చిత్రం అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత మహేశ్​బాబుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు.

మరోవైపు ప్రభాస్​ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న 'రాధేశ్యామ్​' షూటింగ్​ పూర్తి చేసుకొని త్వరలోనే విడుదలయ్యేందుకు ముస్తాబు అవుతోంది. ప్రస్తుతం 'సలార్​', 'ఆదిపురుష్​' చిత్రీకరణలతో ప్రభాస్​ తీరిక లేకుండా గడుపుతున్నారు. ఆ తర్వాత నాగ్​అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాత రాజమౌళితో ప్రభాస్​ పనిచేసే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: 'బాహుబలి' ట్రెండ్​ సెట్​ చేస్తే.. టాలీవుడ్​ ఫాలో అవుతోంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.