సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అడ్వాణీ హీరోహీరోయిన్లుగా(kiara advani sidharth malhotra).. కార్గిల్ యుద్ధ వీరుడు లెఫ్టినెంట్ విక్రమ్ బాత్రా జీవితాధారంగా రూపొందిన హిందీ చిత్రం 'షేర్షా'(shershaah movie). ఆగస్టు 12 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో ఎక్కువ మంది వీక్షించినట్లు మంగళవారం అమెజాన్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 210 దేశాలతో పాటు.. దేశంలోని 4100 నగరాలు, గ్రామాల్లోని ప్రజలు దీన్ని చూశారట. అంతేకాదు.. ఐఎండీబీ 8.9 రేటింగ్(shershaah rating) ఇవ్వగా.. 88 వేల మంది ఐఎండీబీ యూజర్లు అత్యంత గుర్తింపు పొందిన చిత్రంగా ఓటు వేసినట్లు ధర్మా ప్రొడక్షన్స్ వెల్లడించింది.
ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు హీరో సిద్ధార్థ్ మల్హోత్రా.."షేర్షా' చిత్రానికి మీరందరూ కురిపిస్తున్న ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అమెజాన్ ప్రైమ్‌లో ఎక్కువ మంది చూసిన చిత్రంగా గుర్తింపు తీసుకొచ్చినందుకు మీ అందరికీ నా ధన్యావాదాలు" అన్నారు. డింపుల్‌గా నటించిన కియారా అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు.
ప్రస్తుతం ఓటీటీ వేదికలకు లభిస్తున్న ఆదరణతో అగ్రహీరోలు కూడా అటువైపు అడుగులేసేందుకు ముందుకొస్తున్నారు. నటులు అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, షాహిద్ కపూర్ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నట్లు తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీచూడండి: DRUGS CASE : డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. విచారణకు హాజరైన పూరి