దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి బుధవారం కర్ణాటక చామరాజనగర్ జిల్లా బండీపుర్ జాతీయ పార్కును సందర్శించారు.
మంగళవారం భార్యతో కలిసి కనియనపురంలోని సెరాయ్ రిసార్ట్లో బస చేశారు రాజమౌళి. బుధవారం ఉదయం హిమావద్ గోపాలస్వామి హిల్స్ ప్రాంతంలో సఫారీకి వెళ్లారు. అక్కడి ప్రకృతి సోయగాలను ఆస్వాదించారు.


ప్రకృతి సంపదను సంరక్షిస్తున్న అటవీ శాఖ అధికారులకు అభినందనలు తెలిపారు రాజమౌళి. ఆయనతో సెల్ఫీ దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు.

ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సినిమాతో బిజీగా ఉన్నారు రాజమౌళి. ఇందులో రామ్చరణ్, ఎన్టీఆర్ కథానాయకులు. దాదాపు రూ.350 కోట్లతో డీవీవీ దానయ్య ఈ సినిమా నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. సముద్రఖని, రే స్టీవెన్సన్, అలీసన్ డూడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.