ETV Bharat / sitara

చావుబతుకుల మధ్య సినిమాలు చేశా: దర్శకుడు శంకర్ - n shankar karunanidhi

'ఎన్​కౌంటర్' సినిమాకు 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, విశేషాలు పంచుకున్న దర్శకుడు ఎన్.శంకర్. ఆ చిత్రం చేయడానికి గల కారణాలను వెల్లడించారు.

చావుబతుకుల మధ్య సినిమాలు చేశా: దర్శకుడు శంకర్
దర్శకుడు ఎన్.శంకర్
author img

By

Published : Aug 14, 2020, 7:30 AM IST

చిత్రసీమలో కొద్దిమంది వాళ్ల సినిమా పేర్లతోనే ప్రాచుర్యం పొందుతుంటారు. వాళ్లలో 'ఎన్‌కౌంటర్‌' శంకర్‌ ఒకరు. ఈయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'ఎన్‌కౌంటర్‌'. ఆ తర్వాత 'శ్రీరాములయ్య', 'యమజాతకుడు', 'జయం మనదేరా', 'ఆయుధం', 'జై బోలో తెలంగాణ' తదితర చిత్రాలు చేశారు. శంకర్‌ ఇంటిపేరుగా మారిన 'ఎన్‌కౌంటర్‌' ప్రేక్షకుల ముందుకొచ్చి నేటికి(ఆగస్టు 14) 23 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ఆయనతో 'ఈనాడు సినిమా' ముచ్చటించింది.

పరిశ్రమలో మిమ్మల్ని ఇప్పటికీ 'ఎన్‌కౌంటర్‌' శంకర్‌ అనే పిలుస్తుంటారు కదా?

నా పేరుకు ఓ ట్యాగ్‌లైన్‌గా మారిందా సినిమా. 23 ఏళ్లే కాదు, ఇంకా ఎన్నేళ్లయినా ఆ సినిమాను గుర్తుపెట్టుకుంటారు ప్రేక్షకులు. ఆ సినిమా ప్రభావం అంతగా ఉంటుంది. వ్యక్తిగతంగా ఎంతో ఉద్వేగానికి గురై రాసుకున్న కథ అది. నిజానికి నా తొలి ప్రయత్నంగా బాలకృష్ణతో వాణిజ్య ప్రధానమైన ఓ సినిమా తీయాలనుకున్నా. ఆ ప్రయత్నంలో ఉండగానే మా ఊరు నల్గొండ జిల్లా, చిరుమర్తికి వెళ్లా. అప్పుడు భువనగిరి దగ్గర వలిగొండ అనే ఊరికి సమీపంలో 22 ఏళ్లలోపున్న నలుగురు కుర్రాళ్లు ఎన్‌కౌంటర్‌ అయ్యారన్న విషయం తెలిసింది. ఆ సంఘటన ఎంతో ఆవేదనకు గురిచేసింది. 'కమర్షియల్‌ సినిమా ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఈ అంశంపైన మొదట సినిమా తీయాల్సిందే' అని నిర్ణయించుకున్నా. అలా దీనికి బీజం పడింది.

ఈ సినిమా తీసే ప్రయత్నంలో సమస్యలేమైనా ఎదురయ్యాయా?

పోలీసు నిఘా నీడలోనే చిత్రీకరణ జరిగింది. పాటలు విడుదలయ్యాక వాటిని విని 'నిన్ను కూడా ఎన్‌కౌంటర్‌ చేసేస్తారు' అని భయపెట్టారు చాలామంది. అదంతా ఒకెత్తైతే, ఈ సినిమాను పట్టాలెక్కించడంలో చాలా సమస్యల్ని ఎదుర్కొన్నా. మొదట మూడు భాషల్లో సెల్వమణి నిర్మాతగా ఈ సినిమా చేయాలనుకున్నాం. అందుకు తగ్గట్టుగా మమ్ముట్టి, రాధిక, రోజా, ప్రశాంత్‌ తదితరులకు కథ వినిపించాం. వాళ్లంతా చేయడానికి అంగీకారం కూడా తెలిపారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కూడా ఈ కథ విన్నారు.

స్టూడియో నిర్మించాలనే ఆలోచన ఎప్పుడొచ్చింది?

2003 నుంచీ ఉన్న ఆలోచన ఇది. 2004లో జాతీయ పురస్కారాల కమిటీకి వైస్‌ ఛైర్మన్‌గా పనిచేశా. 2012లో నంది అవార్డు కమిటీ ఛైర్మన్‌గా పనిచేశా. చిన్న వయసులో ఈ బాధ్యతల్ని నిర్వర్తించిన వ్యక్తిని నేనే. గోవా ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ అవార్డ్స్‌ జ్యూరీలోనూ, ఆస్కార్‌ ఇండియన్‌ జ్యూరీలోనూ పనిచేశా. నాలుగు సార్లు నంది పురస్కారాల జ్యూరీ సభ్యుడిగానూ కొనసాగా. ఈ క్రమంలోనే అంతర్జాతీయ స్థాయి సినిమాల్ని దగ్గర్నుంచి చూసే అవకాశం దక్కింది. నాకూ ఒక స్టూడియో ఉంటే ఉన్నత ప్రమాణాలతో సినిమాలు చేయొచ్చు, కొత్తవాళ్లకు మరింత మందికి అవకాశాలివొచ్చని 2013లోనే ప్రభుత్వానికి నేను స్టూడియో కోసం దరఖాస్తు చేసుకున్నా. అంతర్జాతీయ స్థాయిలో నేను చూసిన స్టూడియోల గురించి, నా ఆలోచనల గురించి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఆయనకు వివరించా. మెచ్చుకుని ప్రోత్సహించారు.

కరుణానిధికి ఈ కథను ఎందుకు వినిపించారు?

ఎల్‌.టి.టి.ఈ నేపథ్యంలో సాగే కథను చెప్పడం కోసం నా మిత్రుడైన ఓ తమిళ దర్శకుడితో కలిసి కరుణానిధి దగ్గరికి వెళ్లాం. అలా కరుణానిధికీ నాకూ మధ్య నక్సలైట్‌ ఉద్యమం నేపథ్యంతో కూడిన సాహిత్యం గురించి, ఎల్‌.టి.టి.ఈ సాహిత్యం గురించి చర్చ జరిగేది. దాన్ని ఆయన బాగా ఆస్వాదించేవారు. అప్పుడే 'ఎన్‌కౌంటర్‌' కథ కూడా చెప్పా. కానీ అనుకున్న సమయంలో మేం 'ఎన్‌కౌంటర్‌' సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లలేకపోయాం. ఆ నిరుత్సాహంలోనే మా ఊరెళ్లిపోయా. వారం రోజులకే కృష్ణ గారి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసే రవి నుంచి ఫోన్‌ వచ్చింది. పద్మాలయ సంస్థ నుంచి నేనే నిర్మిస్తానని కృష్ణ గారు చెప్పడం వల్ల మళ్లీ హైదరాబాద్‌ వచ్చా. అలా 1997 మేలో చిత్రాన్ని మొదలుపెట్టాం, అదే ఏడాది ఆగస్టు 14న విడుదల చేశాం. నా రెండో సినిమా 'శ్రీరాములయ్య' కూడా తర్వాత ఏడాది ఆగస్టు 14నే విడుదలైంది. అలా నా సినిమాల్లో ఒకదానికి 23 ఏళ్లు పూర్తయ్యాయి. మరో సినిమాకి 22 పూర్తయ్యాయన్నమాట. 'శ్రీరాములయ్య' సమయంలోనూ బెదిరింపులొచ్చాయి. చావు బతుకుల మధ్య సినిమాలు చేశా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.