నిర్మాతకు, దర్శకుడికి మధ్య కథ విషయంలో అభిప్రాయభేదాలు వచ్చి సినిమా ఆగిపోవడం లేదా దర్శకుడిని మార్చడం చాలా సార్లు చూసుంటాం. కానీ ఓ చిన్నపిల్లాడి కంట్లో నీళ్లు విషయమై డైరెక్టరే తప్పుకున్న విషయం మీకు తెలుసా! ఏవియమ్ నిర్మాత చెట్టియార్ - దర్శకుడు తాతినేని ప్రకాశరావు మధ్య 'కళత్తూరు కన్నమ్మ' అనే తమిళ సినిమా విషయంలో ఈ గొడవ జరిగింది. అనంతరం దర్శకుడు సినిమా నుంచి తప్పుకున్నాడు. ఇందులో బాలనటుడు కమల్ హాసన్ కావడం మరో విశేషం.
జెమిని గణేశన్ హీరోగా రూపొందిన ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో కమల్ హాసన్ కళ్లల్లో నీళ్లు ఉంటే బాగుంటుందని నిర్మాత చెట్టియార్.. దర్శకుడిని అడుగుతారు. అవసరం లేదని వాదిస్తారు ప్రకాశరావు. ఇద్దరి మధ్య ఆ వాదన ముదిరి ఈ సినిమా చెయ్యను అని ప్రకాశరావు తప్పుకుంటారు. భీమ్‌సింగ్ అనే దర్శకుడితో సినిమాని పూర్తి చేసి విడుదల చేశారు చెట్టియార్. మొత్తానికి ఈ చిత్రం సూపర్‌హిట్ అయింది. ఈ విధంగా కమల్ హాసన్ కంట్లో నీళ్లు కోసం దర్శకుడే సినిమా నుంచి తప్పుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: ఊరి మీద పడి తినడం బాగా అలవాటు: హరితేజ