డార్లింగ్ ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ షూటింగ్‌ల్లో తీరిక లేకుండా ఉన్నారు. వీటి తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించనున్నారు. ఇప్పుడు ప్రభాస్ కోసం మరో క్రేజీ డైరెక్టర్ కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
విభిన్న చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడిగా చంద్రశేఖర్ యేలేటికి పేరు ఉంది. ఇటీవల నితిన్‌తో తీసిన 'చెక్' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. అయితే మైత్రీమూవీ మేకర్స్‌తో ఓ చిత్రం చేసేందుకు యేలేటి ఒప్పుకున్నారు. మరోవైపు ప్రభాస్‌తో ఓ ప్రాజెక్టు చేసేందుకు మైత్రీ సంస్థ ఎప్పుడో ఒప్పందం చేసుకుంది. దీంతో చంద్రశేఖర్ యేలేటి ప్రభాస్‌తోనే పనిచేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. మరి వీటిలో నిజమెంతో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.