ETV Bharat / sitara

సుకుమార్ లెక్కలతో పాటు కథలు చెప్పేవారు

'ఉప్పెన' విడుదల నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. తను ఇంటర్మీడియట్​లో ఉన్నప్పుడు గురువు సుకుమార్ లెక్కలతో పాటు కథలు చెప్పేవారని అన్నారు.

director buchi babu sana about UPPENA movie
సుకుమార్ లెక్కలతో పాటు కథలు చెప్పేవాణ్ని
author img

By

Published : Feb 11, 2021, 8:37 AM IST

అగ్ర దర్శకుడు సుకుమార్‌ శిష్యగణంలో బుచ్చిబాబు సానా ప్రత్యేకం. ఈయన సుకుమార్‌ నుంచి దర్శకత్వ పాఠాలే కాదు, కాలేజీలో లెక్కల పాఠాలూ నేర్చుకున్నారు. అందుకే తాను పరిచయం చేసిన ఎవరినీ శిష్యులుగా భావించని సుకుమార్‌... బుచ్చిబాబును మాత్రం 'వీడు నా శిష్యుడు' అంటుంటారు. ఈ నెల 12న విడుదలవుతున్న 'ఉప్పెన'తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు బుచ్చిబాబు. వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి జంటగా నటించిన ఈ చిత్రం గురించి, తన జీవిత ప్రయాణం గురించి బుచ్చిబాబు చెప్పిన విషయాలివీ...

"నేను చేసే ప్రతి కథ అందరికీ నచ్చుతుందని నమ్ముతాను. నాకు మట్టిలో నుంచి కథలు చెప్పాలని ఉంటుంది. 'ఉప్పెన' ఒక సినిమా చూస్తున్నట్టు ఉండదు. ఒక ఊళ్లో జరుగుతున్న సంఘటనలా ఉంటుంది. ప్రేమకు హద్దుల్లేవని చెప్పడమే ఈ కథ ఉద్దేశం. సముద్రం నేపథ్యంలో సాగే తమిళ చిత్రాలు చూస్తున్నప్పుడు 'ఇలాంటి నేపథ్యంలో మన కథల్ని చెప్పొచ్చు కదా' అనిపించేది. కానీ అన్ని కథలకూ ఆ నేపథ్యం కుదరకపోవచ్చు. అదృష్టవశాత్తూ 'ఉప్పెన' కథకు కుదిరింది. మాదీ సముద్ర తీరంలోని ఉప్పాడ కొత్తపల్లి దగ్గర పిఠాపురం. మా ఇంటిపై నుంచి చూస్తే సముద్రం కనిపించేది".

"ఎప్పుడైనా ఓ కథ కోరుకున్నది చేశాకే, బిజినెస్‌ టెక్నిక్స్‌ను వాడాలి. ఈ కథ వైష్ణవ్‌ను కోరుకుంది. నేను ఎంబీయే చదువుకున్నాను కాబట్టి నటులు, నిర్మాణ వ్యయం విషయంలో మార్కెటింగ్‌ మెలకువల్ని ఉపయోగించా. జాతీయ స్థాయికి ఈ సినిమాను తీసుకెళ్లాలంటే విజయ్‌ సేతుపతి ఉంటే బాగుంటుందనుకున్నా. కథా ఆయన్ని అంతే బలంగా కోరుకుంది. కథ విన్నాక ఆయన 'ఈ చిత్రం '96' కంటే మంచి హిట్‌ అవుతుంది తమ్ముడూ' అని చెప్పారు. విజయ్‌ సేతుపతితోపాటు, సాయిచంద్‌ నటన సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. కొన్ని సన్నివేశాల్లో విజయ్‌ సేతుపతిని డామినేట్‌ చేసేలా నటించారు. వైష్ణవ్‌కు కథ వినిపించాక చిరంజీవి సర్‌ దగ్గరికి తీసుకెళ్లారు. ముందు భయమేసింది కానీ నేను చెప్పిన కథ విన్నాక 'ఈ సినిమా నువ్వు చేస్తావా? లేక నన్ను చేయమంటావా?' అన్నారు. ఆ మాట విని మురిసిపోయా. అంతగా ఆయనకు నచ్చిందన్నమాట".

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

* "సుకుమార్‌ సర్‌ దగ్గర సహాయ దర్శకుడిగా 'ఆర్య2' నుంచి ఉంటున్నా. ఆయన దర్శకత్వంలోనే నాకు గురువు కాదు, ఇంటర్మీడియట్‌లో మా మ్యాథ్స్‌ లెక్చరర్‌. అప్పటికే కథలు రాసుకునేవారు. ఆయన రాసుకున్న కథలు విద్యార్థుల్లో చాలా తక్కువ మందికి వినిపించేవారు. అందులో నేనొకడిని. లెక్కలతోపాటు నాకు కథలు కూడా చెప్పేవారన్నమాట.

* చిన్నప్పుడు ఒక సినిమాకు వెళ్లొస్తే, పదిమంది కుర్రాళ్లను కూర్చోబెట్టి కథ చెప్పేవాణ్ని. వాళ్లను మళ్లీ సినిమాకు వెళ్లకుండా ఆపేసేవాణ్ని. 'నువ్వు సినిమాకు వెళితే పది టికెట్లు తీసుకోవాలిరా' అనేవారు మా మావయ్యలు. సుకుమార్‌ 'ఆర్య' తీశాక.. ఎలాగో నేను సినిమాల్లోకి వెళతానంటే ఇంట్లో పంపరు కాబట్టి, ఎంబీఏ కోసమని హైదరాబాద్‌కు వచ్చా. మ్యాథ్స్‌ లెక్చరర్‌ అంటే కుర్రాళ్లు భయపడతారు. కానీ కాలేజీలో ఐదు వేల మందికిపైగా విద్యార్థులున్నా వాళ్లందరికీ సుకుమార్‌ సర్‌ అంటే ఇష్టం. ఆయన మ్యాథ్స్‌ చెబితే అర్థం కాని విద్యార్థంటూ ఉండేవాడు కాదు. అలాంటిది ఆయన సినిమా తీస్తే ఎందుకు ఫ్లాప్‌ అవుతుంది? కాదనుకుంటానంతే. 'ఉప్పెన' తర్వాత నేను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలోనే మరో చిత్రం చేయనున్నా. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి".

"రంగస్థలం' సమయంలో సుకుమార్‌ సర్‌కు కథ చెప్పా. ఆయనకు బాగా నచ్చింది. ఒక అమ్మాయిలో ఉప్పెనంత ప్రేమను, ఒక తండ్రిలో ఉప్పెనంత కోపాన్ని ఈ సినిమాలో చూస్తారు. వాణిజ్యాంశాలతో కూడిన ఓ మంచి ప్రేమకథతో తీర్చిదిద్దిన ఫ్యామిలీ డ్రామా. పతాక సన్నివేశాలు అందరి హృదయాల్ని హత్తుకుంటాయి. మన కుటుంబాల్లోని మహిళలందరికీ నచ్చుతుంది. వాళ్ల కోణంలో నుంచే ఈ కథను రాశా"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.