ETV Bharat / sitara

కళ్లజోడుతో క్లాస్​గా కనిపించే ఊరమాస్​ డైరెక్టర్​ - మాస్​ డైరెక్టర్​ బోయపాటి శ్రీను

కొంతమంది దర్శకులు కేవలం కుటుంబ కథా చిత్రాలు మాత్రమే తెరకెక్కించగలరు. ఇంకొంతమంది దర్శకులు కేవలం యాక్షన్‌ తరహా సినిమాలు మాత్రమే రూపొందిస్తారు. కానీ ఎమోషన్, యాక్షన్, రిలేషన్‌ సమపాళ్లలో పెట్టి సినిమాలు రూపొందించగల దర్శకుడు అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు బోయపాటి శ్రీను. చేసే ప్రతీ సినిమాను చేసిన సినిమా కంటే బాగుండాలని తాపత్రయపడే దర్శకుల జాబితాలో మొదట ఉండే దర్శకుడు బోయపాటి. నేడు (ఏప్రిల్​ 25) బోయపాటి శ్రీను పుట్టినరోజు సందర్భంగా అతని కెరీర్​లోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

Director Boyapati Srinu Birthday special Story
కళ్లజోడుతో క్లాస్​గా కనిపించే ఊరమాస్​ డైరెక్టర్​
author img

By

Published : Apr 25, 2020, 5:33 AM IST

మాస్‌ నాడి తెలిసిన దర్శకుడు... బోయపాటి శ్రీను. పతాక స్థాయి వాణిజ్య హంగులు... హీరోయిజం ఆయన సినిమాల్లో ఉట్టిపడుతుంటాయి. తెలుగు చిత్రసీమలో అగ్ర దర్శకుడిగా కొనసాగుతున్న బోయపాటి బాక్సాఫీసుని ప్రభావితం చేసేలా సినిమాల్ని తీశారు. ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్టాత్మక నంది పురస్కారాన్ని అందుకున్నారు.

బోయపాటి శ్రీను.. గుంటూరు జిల్లా, పెద కాకానిలో జన్మించారు. గుంటూరులోని జేకేసీ కళాశాల నుంచి డిగ్రీ పట్టభద్రుడై.. నాగార్జున విశ్వ విద్యాలయంలో చేరారు. వారి కుటుంబానికి ఫొటో స్టూడియో ఉండటం వల్ల సినీ పరిశ్రమ వైపు ఆసక్తిని కనబరిచారు. అనంతరం కొన్నాళ్లపాటు పాత్రికేయుడిగా పనిచేశారు.

Director Boyapati Srinu Birthday special Story
బోయపాటి శ్రీను

చిత్రసీమలో ఎంట్రీ

1997లో ముత్యాల సుబ్బయ్య దగ్గర దర్శకత్వ శాఖలో చేరారు. 'ఒక చిన్న మాట', 'గోకులంలో సీత', 'పెళ్ళి చేసుకుందాం', 'పవిత్ర ప్రేమ', 'అన్నయ్య', 'మనసున్న మారాజు' తదితర చిత్రాలకి సహాయ దర్శకుడిగా పనిచేశారు బోయపాటి. 'భద్ర'తో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రమే ఘన విజయం సాధించడం వల్ల బోయపాటి శ్రీనుకి అగ్ర కథానాయకులతో కలిసి సినిమాలు చేసే అవకాశం వచ్చింది.

అగ్రహీరోలతో సినిమాలు

వెంకటేష్‌తో 'తులసి', బాలకృష్ణతో 'సింహా' తీసి విజయాల్ని అందుకొన్నారు. 2012లో ఎన్టీఆర్‌ కథానాయకుడిగా 'దమ్ము' సినిమాను తెరకెక్కించారు. 2014లో బాలకృష్ణతో మరోసారి 'లెజెండ్‌' తీసి మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్‌ కథానాయకుడిగా 'సరైనోడు' చిత్రంతో బ్లాక్​బాస్టర్​ హిట్​ దక్కించుకున్నారు. ఆ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లు సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన 'జయ జానకి నాయక'తో పర్వాలేదనిపించిన... రామ్​ చరణ్​ హీరోగా రూపొందిన 'వినయ విధేయ రామ'తో పరాజయాన్ని చవిచూశారు.

పురస్కారాలు

ప్రస్తుతం బాలకృష్ణతో కలిసి మూడో చిత్రం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. 'లెజెండ్‌' చిత్రానికిగానూ ఆయనకి ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారం లభించింది. ఆయన తీసిన 'సరైనోడు' చిత్రం హిందీలో డబ్‌ అయ్యింది. ఆ చిత్రానికి యూ ట్యూబ్‌లో 11 కోట్ల వీక్షణలు లభించడం విశేషం.

బోయపాటి శ్రీను కుటుంబం

ఇదీ చూడండి.. ఆ దర్శకుడు నన్ను మోసం చేశాడు: రాశి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.