ETV Bharat / sitara

NTR jayanthi: అలా.. ఎన్టీఆర్​ కోరికతో!

author img

By

Published : May 28, 2021, 8:27 AM IST

Updated : May 28, 2021, 8:59 AM IST

'శ్రీనాథుడి' కథ గురించి ప్రజలకు అంతగా అవగాహన లేదని.. అది సినిమాగా తెరకెక్కిస్తే నష్టపోవాల్సి వస్తుందని బాపు రమణలు.. సీనియర్ ఎన్టీఆర్​తో అన్నారట. అయినా సరే నిష్ఠతో చేద్దామంటూ ఆయన​ చెప్పగా.. అలా ఆ సినిమాను పట్టాలెక్కించారు. అయితే చిత్రం కోసం తారకరాముడు అంతలా కోరడానికి ఓ కారణముందట.

Director Bapu says not to make Srinathuni katha movie to Sr.NTR
NTR birth anniversary: ఎన్టీఆర్​కు ఆ వేషం వేయాలని కోరిక!

స్వర్గీయ నందమూరి తారకరామారావు వేసిన ఏ పాత్రకైనా ఇంకెవరూ సాటిరారు. ఆయన నటించిన భక్తి చిత్రాలు చూసిన ప్రేక్షకులు.. దేవుడు ఇలానే ఉంటాడేమో అనుకునేవారు. మరి అలాంటి వ్యక్తి ఓ సినిమాలో కచ్చితంగా నటించాలని పట్టుబట్టారట.

శ్రీనాథుడి కథను చిత్రంగా రూపొందించాలని ఎన్టీఆర్​కు కోరిక ఉండేదట​. ఈ విషయంపై బాపు రమణలతో మాట్లాడితే.. వాళ్లేమో "శ్రీనాథుడి జీవితంలో పెద్ద కథేం ఉండదు. సామాన్యులకు ఆయన ఎవరో తెలీదు. అది సినిమా తీయడం అంటే ఇబ్బందే. ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందేమో!" అని అన్నారట.

ఆ మాటలకు బదులిచ్చిన ఎన్టీఆర్​.. "ఏం ఫర్వాలేదు. నష్టం వచ్చినా నాకు ఇబ్బంది లేదు. మనం నిష్ఠగా కచ్చితమైన శ్రద్ధతో సినిమా తీద్దాం. ప్రజాదరణ పొందకపోయినా ఇబ్బంది లేదు. కొందరైనా ఆ సినిమా చూస్తారు. ఆ తృప్తి చాలు. ఏమైనా, శ్రీనాథుడి పాత్ర ధరించాలనేది నా కోరిక. అంతే" కచ్చితమైన నిర్ణయం చెప్పారట​‌. అలా ఆయన పట్టుదల వల్లే శ్రీనాథుడి కథ వెండితెరపైకి వచ్చి.. ఎందరినో విశేషంగా ఆకట్టుకుంది.

ఇదీ చూడండి: ఎన్టీఆర్ జయంతికి నందమూరి హీరోల అప్​డేట్లు

Last Updated : May 28, 2021, 8:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.