Director Bala Divorce: కోలీవుడ్లో మరో సెలబ్రిటీ జంట విడాకులు తీసుకుంది. ఇదివరకే సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు హీరో ధనుష్- ఐశ్వర్యలు విడిపోగా.. తాజాగా తమిళ ప్రముఖ దర్శకుడు బాల.. తన భార్య మధుమలార్కు విడాకులు ఇచ్చారు. వీరిద్దరూ 2004లో మధురైలో పెళ్లిచేసుకున్నారు. వారికి ప్రార్థన అనే ఓ కుమార్తె కూడా ఉంది.
అయితే డైరెక్టర్ బాల.. మధుమలార్కు నాలుగేళ్ల క్రితమే విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేసుకోగా.. ఇటీవల కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది.
బాల డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ తమిళ గ్రామీణ నేపథ్యానికి దగ్గరగా ఉంటాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన శివపుత్రుడు, నేనే దేవుణ్ని, వాడు- వీడు చిత్రాలు విజయం సాధించడమే కాక ప్రశంసలు దక్కాయి. నేనే దేవుణ్ని సినిమాకు ఏకంగా జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్నారు బాల. ప్రస్తుతం బాల.. సూర్యతో ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: Prabhas Marriage Date: 'ప్రభాస్ పెళ్లి తేదీ అదే'