కెమెరా ముందు కనిపించే నటీనటులను తాను దైవంగా చూస్తానని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. తన 16 ఏళ్ల సినీ జీవితంలో ఎప్పుడు కూడా ఎవరిపై పరుషంగా వ్యవహారించలేదని అనిల్ స్పష్టం చేశారు. ప్రముఖ నటుడు ఉత్తేజ్ నిర్వహిస్తున్న మయూఖా టాకీస్ నటశిక్షణ కేంద్రంలో తొమ్మిదో బ్యాచ్ ప్రారంభోత్సవానికి నటుడు రఘుబాబుతో కలిసి అనిల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
కళ అనేది దేవుడి ఇచ్చిన వరంగా భావించాలని అనిల్ రావిపూడి సూచించారు. చాలామంది నటనలో శిక్షణ అవసరం లేదని అభిప్రాయపడతారని, కానీ ప్రతి నటుడికి శిక్షణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. రఘుబాబు కూడా తన వ్యక్తిగత జీవితాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా తాను నటుడిగా మారాల్సి వచ్చిందని వివరించారు.
తన శిక్షణ కేంద్రం నుంచి ఇప్పటి వరకు 13 మంది విద్యార్థులు సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో హీరోలుగా నటిస్తున్నారని ఉత్తేజ్ వెల్లడించారు.