యువ కథానాయకుడు రామ్ తన పుట్టినరోజు సందర్భంగా ఏం ప్రకటిస్తాడా? అని ఆసక్తిగా ఎదురు చూశారు అభిమానులు. ఈరోజు (మే 15) రామ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ హీరో నటిస్తోన్న కొత్త సినిమాలోని సాంగ్ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా 'రెడ్' అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి మణిశర్మ సంగీత దర్శకత్వంలో రూపొందిన 'డించక్' అనే మాస్ బీట్‌కి సంబంధించిన గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. ఫుల్ మాస్ సాంగ్‌గా తెరకెక్కిన ఈ పాటలో రామ్, హెబ్బా పటేల్ తమ డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. మణిశర్మ సంగీతం అలరించేలా ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">