బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోంది. మరో మూడు-నాలుగు రోజుల్లో ఆయనను డిశ్చార్జ్ చేయనున్నట్లు డాక్టర్ జలీల్ పార్కర్ వెల్లడించారు. ఆయనను ఇంకా ఆక్సిజన్ సపోర్ట్‌పైనే ఉంచినట్లు వెల్లడించారు.
శ్వాసకోస సమస్యలతో ఆదివారం(జూన్ 6) ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయను ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అంతకు ముందు తన భర్త ఆరోగ్యం గురించి దిగ్గజ నటి సైరా భాను మాట్లాడారు. అభిమానుల, సన్నిహితుల ప్రార్ధనల వల్ల కోలుకుంటున్నారని, త్వరలో ఆయనను డిశ్చార్జ్ చేస్తారని వెల్లడించారు.
ఇది చదవండి: బాలీవుడ్ దిగ్గజ నటుల ఇళ్లపై తెగని బేరం