"మహిళలు 'ఇది మా సినిమా..' అంటూ సొంతం చేసుకున్నారు. వాళ్లే ప్రచారం చేశారు. 'మా హీరోకు ఇలాంటి సినిమా పడటం అద్భుతం' అంటూ అభిమానులు మెచ్చుకున్నారు. ఇలా ఏ రకంగా చూసినా 'వకీల్‌సాబ్' మెప్పు పొందింది" అని అన్నారు దిల్‌రాజు. ఆయన శిరీష్‌తో కలిసి నిర్మించిన చిత్రం 'వకీల్‌సాబ్'. పవన్‌కల్యాణ్ హీరోగా నటించారు. శ్రీరామ్ వేణు దర్శకుడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు శనివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు.
"చేసిన సినిమా మనసుకు సంతృప్తినివ్వాలి, దాంతో డబ్బు రావాలి. 'వకీల్‌సాబ్'తో ఈ రెండూ మాకు దక్కాయి' అని నిర్మాత దిల్‌రాజు అన్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వాలు యాభై శాతం ప్రేక్షకులతో ప్రదర్శనలు చేయాలనే నిబంధనలు తీసుకొచ్చినా సినిమాలు విడుదల చేయడమే ఉత్తమం అని చెప్పారు. "ప్రేక్షకులు సినిమా చూడాలి, అదే సమయంలో కరోనా రాకుండా జాగ్రత్తలన్నీ పాటించాలి. సీటింగ్ పరంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు అంగీకారమే. దేశంలో మిగతా చిత్ర పరిశ్రమలతో పోలిస్తే మనం ధైర్యం చేశాం. అందుకే 'క్రాక్' మొదలుకొని నాలుగు నెలలుగా విజయాల్ని సొంతం చేసుకున్నాం. చిత్ర పరిశ్రమలో అందరికీ ఉపాధి దొరికింది" అని అన్నారు.
"మంచి సినిమా చేస్తే దాని విజయానికి ఏ అడ్డంకీ ఉండదని తెలుగు ప్రేక్షకులు ‘వకీల్‌సాబ్’తో మరోసారి నిరూపించారు. నా మొదటి రెండు చిత్రాల కంటే కూడా ఒక రీమేక్‌తో దర్శకుడిగా నాకు ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు" అని దర్శకుడు శ్రీరామ్ వేణు అన్నారు.
మా తదుపరి చిత్రం.. 'ఐకాన్'
నేను, శ్రీరామ్ వేణు కలిసి తదుపరి చేయబోయేది ‘ఐకాన్’ చిత్రమే అన్నారు దిల్‌రాజు. అల్లు అర్జున్ కథానాయకుడిగా రూపొందనున్న చిత్రమిది. "నా మనసుకు బాగా నచ్చిన కథ అది. పూర్తిస్థాయి స్క్రిప్టు సిద్ధంగా ఉంది. దర్శకుడు శ్రీరామ్ వేణు ఆ కథ చెప్పినప్పట్నుంచి మేం దాంతో ప్రయాణం చేశాం. కథ మా దగ్గర సిద్ధంగా ఉంది కాబట్టి తప్పక మొదలు పెడతాం" అని దిల్‌రాజు వెల్లడించారు.