ETV Bharat / sitara

'మీరు ఎల్లపుడూ సంతోషంగా ఉండాలి' - దిల్​రాజు రెండో వివాహం

ప్రముఖ నిర్మాత దిల్​రాజు రెండో వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమార్తె హన్షితా రెడ్డి తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు.

దిల్​రాజు
దిల్​రాజు
author img

By

Published : May 11, 2020, 3:29 PM IST

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు రెండో వివాహం చేసుకున్నారు. ఆదివారం రాత్రి 7.23 గంటలకు నిజామాబాద్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తేజస్వినితో ఆయన పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా దిల్‌రాజు కుమార్తె హన్షితా రెడ్డి తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ పోస్ట్‌ చేశారు.

"మీరు ఎల్లప్పుడూ నాకు బలంగా ఉన్నారు. నన్ను సంరక్షించినందుకు.. నిరంతరం కుటుంబ సభ్యుల ఆనందానికే ప్రాధాన్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన మీరిద్దరు సంతోషంగా, ప్రేమతో కలిసి ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి రోజు మీకు ఓ అద్భుతమైన రోజు కావాలని ఆశిస్తున్నా. నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నా.. మీ హన్షు."

-హన్షితా రెడ్డి, దిల్​రాజు కుమార్తె

దిల్‌రాజు సతీమణి అనిత 2017లో అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆయన రెండో వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఆయన పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.