'ఎవడు', 'అభినేత్రి', 'రోబో 2.0' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి అమీజాక్సన్. '2.0' సినిమా తర్వాత వెండితెరకు దూరంగా ఉన్న ఈ నటి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అమీజాక్సన్ తనకు కాబోయే భర్తకు బ్రేకప్ చెప్పేశారని అందరూ చెప్పుకుంటున్నారు. మనస్పర్థలు రావడం వల్ల వీరిద్దరూ తమ ప్రేమకు స్వస్తి పలికారని వరుస కథనాలు వస్తున్నాయి.
వెండితెరపై నటిగా రాణిస్తున్న తరుణంలో ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో అమీజాక్సన్‌కు పరిచయమైంది. అనంతరం వీరిద్దరూ తమ స్నేహబంధాన్ని ప్రేమగా మార్చుకున్నారు. కొంతకాలంపాటు సహజీవనంలో ఉన్న ఈ జంటకు ఆండ్రూ అనే బాబు కూడా జన్మించాడు. ఈ క్రమంలోనే అమీ-జార్జ్ గతేడాది వివాహం చేసుకుందామని భావించారు. కరోనా కారణంగా వీరి వివాహం వాయిదా పడింది. అయితే అమీజాక్సన్.. జార్జ్ పనియోటౌకు సంబంధించిన అన్ని ఫొటోలను ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి తొలగించింది. దీంతో వీరిద్దరూ విడిపోయారంటూ పలు వార్తాకథనాలు బయటకు వచ్చాయి. వ్యక్తిగత విషయాల్లో వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడం వల్లే విడిపోయారంటూ సమాచారం. సదరు వార్తలపై అమీజాక్సన్ ఏమాత్రం స్పందించలేదు.
ఇదీ చూడండి: అమీ జాక్సన్ వ్యాయామ విన్యాసాలకు అభిమానులు ఫిదా