ETV Bharat / sitara

బయోపిక్​ల కోసం సెలబ్రిటీల పారితోషికం ఎంతంటే?

బాలీవుడ్​లో రూపొందిన బయోపిక్​లు అత్యంత ప్రజాదరణ పొంది.. బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించాయి. తమ వ్యక్తిగత జీవితాలను వెండితెరపై చూపించేందుకు ఎందరో ప్రముఖులు చిత్రబృందాలకు తమ అనుమతినిచ్చారు. అయితే ఆ చిత్రాల కోసం తమ వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వడానికి సంబంధిత ప్రముఖులు కొంత పారితోషికాన్ని తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తమ బయోపిక్​ల కోసం రెమ్యూనరేషన్​ తీసుకున్న ప్రముఖుల వివరాలను తెలుసుకుందాం.

Dhoni to Sanjay Dutt, how much these 6 celebrities charged for letting a biopic to be made on them
బయోపిక్​ అనుమతి కోసం సెలబ్రిటీల పారితోషకం
author img

By

Published : Dec 3, 2020, 6:01 PM IST

సినీ పరిశ్రమలో ఏ చిత్రం విడుదలైనా.. అది బాక్సాఫీస్​ వద్ద వసూళ్లు ఎలా రాబట్టింది!, నటీనటులు ఎంత పారితోషికం తీసుకున్నారనే దానిపై అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే బయోపిక్​లకు తమ వ్యక్తిగత సమాచారాన్ని అందించిన కొందరు ప్రముఖులూ కొంత పారితోషికాన్ని​ ఆశిస్తుంటారు. బాలీవుడ్​లో రూపొందిన ధోనీ బయోపిక్​ నుంచి 'సంజు' చిత్రం వరకు తమ వ్యక్తిగత జీవితాలను బయోపిక్​లుగా తెరకెక్కించేందుకు పలువురు సెలబ్రిటీలు అంగీకారం తెలిపారు. ఇందులో భాగంగా తమ వ్యక్తిగత జీవితం గురించి చిత్రబృందానికి సమాచారం ఇవ్వడం సహా కొన్నింటిలో సహాయపడేందుకు ఆ వ్యక్తుల నుంచి నిర్మాణ సంస్థలకు అంగీకారం లభిస్తుంది. ఇలా తమ జీవితాధారంగా తెరకెక్కిన బయోపిక్​లకు పలువురు ప్రముఖులు తీసుకున్న రెమ్యూనరేషన్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

1. ఎంఎస్​ ధోని (ఎంఎస్​ ధోని: ది అన్​టోల్డ్​ స్టోరీ)

బాలీవుడ్​లో తెరకెక్కిన 'ఎంఎస్​ ధోని: ది అన్​టోల్డ్​ స్టోరీ' విజయవంతమైన బయోపిక్​గా నిలిచింది. ధోని పాత్రలో దివంగత నటుడు సుశాంత్​ సింగ్ రాజ్​పుత్​ నటించగా.. కియారా అడ్వాణీ, దిశా పటానీ నాయికలుగా కనిపించారు. నీరజ్​ పాండే దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చిన్ననాటి నుంచి ధోని.. క్రికెట్​పై చూపించే ఆసక్తి.. ఆ తర్వాత భారతీయ రైల్వేలో ఉద్యోగం చేస్తూ టీమ్​ఇండియాలో ఏ విధంగా చోటు సంపాదించుకున్నాడనేది కథాంశం. ధోనీ వ్యక్తిగత జీవితంతో పాటు క్రికెట్​ కెరీర్​ గురించి స్పష్టంగా చూపించడంలో దర్శకుడు విజయం సాధించాడు. తన బయోపిక్​ను నిర్మించడానికి చిత్రబృందం నుంచి ధోని రూ.45 కోట్లను తీసుకున్నాడని ఓ సర్వే తెలిపింది. అయితే ఈ వార్త అసత్యమని తెలిపిన టైమ్స్​ ఆఫ్​ ఇండియా.. ఈ సినిమా కోసం ధోని ఎంత పారితోషికం ఆశించాడో తెలియజేయలేదు.

Dhoni to Sanjay Dutt, how much these 6 celebrities charged for letting a biopic to be made on them
ఎంఎస్​ ధోని: ది అన్​టోల్డ్​ స్టోరీ

2. సంజయ్​ దత్​ (సంజు)

ప్రముఖ నటుడు సంజయ్​ దత్​ జీవితాధారంగా బాలీవుడ్​లో రూపొందిన చిత్రం 'సంజు'. సంజయ్​ దత్​ పాత్ర పోషించిన రణ్​బీర్​ కపూర్​కు విమర్శకుల నుంచి మంచి మార్కులే దక్కాయి. సంజయ్​ దత్​ వ్యక్తిగత జీవితంతో పాటు ఆయన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న అవరోధాలను కళ్లకు కట్టినట్టు చూపించడంలో దర్శకుడు రాజ్​కుమార్​ హిరాణీ విజయం సాధించాడు. అయితే ఈ బయోపిక్​ కోసం తన వ్యక్తిగత సమాచారాన్ని పంచుకున్నందుకుగానూ సంజయ్​ దత్​ రూ.9 నుంచి 10 కోట్లను తీసుకున్నాడని టైమ్స్​ ఆఫ్​ ఇండియా తెలిపింది. దీనితో పాటు బాక్సాఫీస్​ వద్ద వచ్చిన లాభంలో భాగం తీసుకున్నాడని స్పష్టం చేసింది.

సంజు

3. మేరీ కోమ్​ (మేరీకోమ్​)

భారత బాక్సింగ్​ క్రీడాకారిణి మేరీ కోమ్​ జీవితాధారంగా రూపొందిన చిత్రం 'మేరీకోమ్​'. 2008లో ప్రపంచ బాక్సింగ్​ ఛాంపియన్​గా నిలిచేంత వరకు ఆమె ఏ విధంగా కష్టపడిందనే విషయాన్ని వెండితెరపై దర్శకుడు ఓముంగ్​ కుమార్​ చక్కగా చూపించాడు. ఇందులో ప్రియాంకా చోప్రా టైటిల్​ రోల్​ పోషించింది. తన బయోపిక్​ను రూపొందించేందుకు అనుమతి కోసం మేరీకోమ్ రూ.25 లక్షలను తీసుకున్నట్లు ఓ సర్వే తెలిపింది. ఈ సినిమాకు ఉత్తమ ఆదరణ పొందిన సినిమా విభాగంలో జాతీయ అవార్డు దక్కింది.

మేరీకోమ్​

4. పాన్​ సింగ్​ తోమర్​ (పాన్​ సింగ్​ తోమర్​)

బాలీవుడ్​ నటుడు ఇర్ఫాన్​ఖాన్​ నటించిన అత్యుత్తమ చిత్రాల్లో ఇదొకటి. పాన్​ సింగ్​ తోమర్​ వ్యక్తిగత జీవితంతో పాటు జాతీయ స్థాయి అథ్లెట్​గా ఎదగడం​ నుంచి చంబల్​ వ్యాలీలో అత్యంత అపఖ్యాతి పొందిన దొంగగా ఎలా మారాడన్నదే ఈ చిత్ర సారాంశం. ఈ బయోపిక్​ కోసం పాన్​ సింగ్​ తోమర్​ చిత్రబృందం నుంచి రూ.15 లక్షలను తీసుకున్నట్లు మిడ్​-డే సర్వే తెలిపింది. అయితే హిందూస్థాన్​ టైమ్స్​ ప్రకారం.. ఈ చిత్ర దర్శకుడిపై తోమర్​ మేనల్లుడు టిగ్మాన్ష్​ ధులియా కేసు నమోదు చేశాడని తెలుస్తోంది. సినిమా రూపొందించేందుకుగానూ రూ.40 లక్షలను చెల్లించడంలో దర్శకుడు విఫలమయ్యాడని ధులియా ఆరోపించాడు.

పాన్​ సింగ్​ తోమర్​

5. లక్ష్మీ అగర్వాల్​ (ఛపాక్​)

యాసిడ్​ దాడి బాధితురాలైన లక్ష్మీ అగర్వాల్​.. తన జీవితాధారంగా సినిమాను రూపొందించేందుకు చిత్రబృందం నుంచి రూ.13 లక్షలను తీసుకుందని ఫ్రీ ప్రెస్​ జర్నల్​ సర్వే వెల్లడించింది. మాలతి అని యువతి.. తనపై యాసిడ్​ దాడి జరిగిన తర్వాత న్యాయం కోసం పోరాడటం సహా ఇతర యాసిడ్​ బాధితురాళ్లకు మద్దతుగా న్యాయపోరాటం చేసి భారతదేశంలో యాసిడ్​ అమ్మకాల విషయంలో మార్పులు తీసుకొచ్చింది.

ఛపాక్​

6. మిల్కా సింగ్​ (భాగ్ మిల్కా భాగ్​)

మిల్కా సింగ్​ను ఫ్లయింగ్​ సిక్కు అని కూడా పిలుస్తారు. అతడు తన బయోపిక్​ కోసం కేవలం ఒక రూపాయి వసూలు చేశాడని వెల్లడైంది. ఇందులో ఫర్హాన్​ అక్తర్​, సోనమ్​ కపూర్​లు ప్రధానపాత్రల్లో నటించారు. హిందూస్థాన్​ టైమ్స్​ నివేదిక ప్రకారం మిల్కా సింగ్​ మాత్రమే కాకుండా మిగిలిన నటీనటులూ అతి తక్కువ పారితోషికాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని పాత్ర కోసం సోనమ్​ కపూర్​ 11 రూపాయలు రెమ్యూనరేషన్​ తీసుకుంది. మిల్కా సింగ్​ పాత్రలో నటించిన ఫర్హాన్​ అక్తర్​.. "వంద మీటర్ల పరుగు కోసం 11.4 సెకన్లను తీసుకున్నా" అని వెల్లడించాడు. ఒలింపిక్స్​లో మిల్కా సింగ్​ పరుగు పూర్తి చేసిన సమయమిది.

భాగ్​ మిల్కా భాగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.