తమిళ చిత్రం 'వెల్లైలా పట్టాదారి'కి అనువాదమే 'రఘువరన్ బీటెక్'. కామెడీ.. ప్రేమ.. సెంటిమెంట్.. వీటితో పాటు ఓ సామాన్య మధ్య తరగతి యువకుడు లక్ష్య సాధనలో ఎదురయ్యే ఇబ్బందులు ఎలా ఎదుర్కొన్నాడనే కథాంశంతో సినిమా తెరకెక్కింది. తమిళ చిత్రం 2014 జులై 18న విడుదలకాగా.. రఘువరన్ బీటెక్ 2015 జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ తేదీలతో సంబంధం ఏమిటా అని ఆలోచిస్తున్నారా..! ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.
మళ్లీ అదే తేదీలో..
ఇప్పుడు మళ్లీ అదే తేదీలో మరోసారి తెలుగు అభిమానుల ముందుకు రాబోతున్నాడు ధనుష్. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఈ హీరో 'ఎన్నై నొక్క పాయమ్ తోటా' చేశాడు. ఈ సినిమాను తెలుగులో 'తూటా' పేరుతో 2020 జనవరి 1న విడుదల చేయనున్నారు.
ఇన్నేళ్ల తర్వాత..
ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే తేదీలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడంటే విశేషమే కదా! మరి ఈ చిత్రం ధనుష్ అభిమానులను ఎంత వరకు మెప్పించగలదో తెలుసుకోవాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇవీచూడండి.. కట్టప్పలా ఈ పాత్ర గుర్తుండిపోతుంది: సత్యరాజ్