ETV Bharat / sitara

'ప్రేమకథలకి సంగీతం.. ఆ కిక్కే వేరప్పా' - Devi Sri Prasad about Pushpa

వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఉప్పెన'. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వహించాడు. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తుందీ సినిమా. ఈ నేపథ్యంలో దేవి ఈటీవీ భారత్​తో మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నాడు.

Devi Sri Prasad about
దేవిశ్రీ ప్రసాద్
author img

By

Published : Feb 6, 2021, 8:22 AM IST

దేవిశ్రీ ప్రసాద్‌ బాణీ అంటే ఎప్పుడూ ప్రత్యేకమే. హుషారెక్కించేలా ఆయనొక గీతం సిద్ధం చేశాడంటే శ్రోతలు కెవ్వు కేక అనాల్సిందే. రింగ రింగ అంటూ అది సెల్‌ఫోన్లలో రింగ్‌టోన్లుగా మార్మోగాల్సిందే. మనసుకు హత్తుకునేలా ఓ మెలోడీ చేశాడంటే అది ఒక్కసారి విన్నా మనసుల్లోనూ, పెదాలపై అలా నిలిచిపోవాల్సిందే. ఇక సుకుమార్‌లాంటి దర్శకుడు తోడయ్యాడంటే దేవి మరింతగా విజృంభిస్తాడు. 'ఉప్పెన' పాటలు వింటే ఆ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. సుకుమార్‌ రైటింగ్స్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ కలిసి నిర్మించిన చిత్రమిది. పంజా వైష్ణవ్‌తేజ్‌ కథా నాయకుడిగా నటించాడు. బుచ్చిబాబు సానా దర్శకుడు. ఈ నెల 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌తో ఈటీవీ భారత్’ ముచ్చటించింది. ఆ విషయాలివీ..

'ఉప్పెన'.. చాలా రోజుల తర్వాత మీరు చేసిన ప్రేమకథ కదా..?

ఈ మధ్య తెరకెక్కుతున్న ప్రేమకథలు కూడా తక్కువే కదా. లోకమంతా ఒకళ్లనొకరు ద్వేషించుకోవడంలో బిజీగా ఉంటూ.. ప్రేమించుకోవడమే తక్కువైంది (నవ్వుతూ). మళ్లీ ఇప్పుడు ఎక్కువగా ప్రేమించుకుంటే బాగుంటుంది. ఒకేసారి రెండు ప్రేమకథలు 'ఉప్పెన', 'రంగ్‌దే'లకి పనిచేయడం చాలా సంతోషాన్ని పంచింది. నా కెరీర్‌ ఆరంభం నుంచి కూడా, నాకు ఎక్కువగా పేరు తీసుకొచ్చింది ప్రేమకథలే. ఎంతైనా ప్రేమకథలకి సంగీతం ఇస్తున్నప్పుడు కలిగే ఆ కిక్కే వేరప్పా (నవ్వుతూ).

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రేమకథల్ని అంతగా ప్రేమించడం వెనక ప్రత్యేక కారణమేమైనా ఉందా?

ప్రేమంటే ప్రతి మనిషికీ నచ్చే భావోద్వేగం. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఎవరైనా సరే...ఆ కథల్ని ఇష్టపడతారు. అందులో ఒక స్వీట్‌నెస్‌ ఉంటుంది. వాటికి సంగీతం అంటే ఎక్కువగా మెలోడీలు వస్తాయి. మెలోడీస్‌ వచ్చినప్పుడు అవి ఎక్కువ కాలం నిలబడతాయి. ఎప్పుడో చేసిన 'ఆనందం', 'కలుసుకోవాలని', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'వర్షం' సినిమాల పాటలు ఇప్పటికీ ఎందుకు గుర్తున్నాయంటే అవి ప్రేమకథలు కావడమే. చేసేవాళ్లకీ, చూసేవాళ్లకీ ఆ కథలంటే అంత ఇష్టం.

సుకుమార్‌తో మీరు ప్రయాణం చేయడం కొత్త కాదు. ఆయన శిష్యుడితో చేసిన 'ఉప్పెన' ప్రయాణం ఎలా సాగింది?

బుచ్చిబాబు సానా నాకు సుక్కూ భాయ్‌ దగ్గర ఉన్నప్పట్నుంచే తెలుసు. తను మంచి సంగీత ప్రియుడు. 'పుష్ప' మొదలుకాక ముందు ఆ సినిమా పనిమీదే సుక్కూ చెన్నై వచ్చారు. కొన్ని విషయాలు మాట్లాడుకున్నాక 'డార్లింగ్‌ నీకు బుచ్చి తెలుసు కదా, నాతోపాటు తీసుకొచ్చాను. తను ఒక కథ చేశాడు, అద్భుతంగా ఉంది. వినాలి ఒకసారి' అన్నారు. అలా తనని కూర్చోబెట్టి వెళ్లిపోయారు. కథ విన్న వెంటనే నాకు మతిపోయింది. 'జల జల జలపాతం..' పాట సందర్భం గురించి విన్న వెంటనే ఈ పాట కోసం ఈ సినిమా చేస్తానన్నా. ఈ సినిమాకి ఆ పాటే నా టార్గెట్‌. కానీ అన్ని పాటలూ చాలా బాగా వచ్చాయి. శ్రీమణి, చంద్రబోస్‌ చాలా మంచి సాహిత్యం ఇచ్చారు. నేను ఓ పాట రాశా. బుచ్చిబాబుతో ప్రయాణం దాదాపు సుక్కూతో పనిచేసినట్టే అనిపించింది.

సుకుమార్‌తో 'పుష్ప' చేస్తున్నారు కదా..? ఆ విశేషాలేమిటి? ఎప్పట్లాగే ఇందులో కూడా ప్రత్యేక గీతం ఉంటుందా?

ప్రత్యేక గీతం కచ్చితంగా ఉంటుంది. అది ఇప్పటికే సిద్ధమైంది కూడా (నవ్వుతూ). 'పుష్ప' కచ్చితంగా మరొక భిన్నమైన ఆల్బమ్‌ అవుతుంది. బన్నీ డార్లింగ్‌ ఒక పక్క, సుక్కూభాయ్‌ ఒక పక్క. మంచి సంగీతం వినబోతున్నారు. బన్నీ అయితే సెట్స్‌ నుంచి ఫోన్‌ చేశారు. "దేవీ.. ఎలాగో సుక్కు సినిమా అంటే అదరగొడతావని తెలుసు కానీ, ఇది అంచనాల్ని మించి వెళ్లిపోయింది" అన్నారు. లొకేషన్లో నిర్మాత దిల్‌రాజుకి కూడా పాట వినిపించారు. ఆయన కూడా చాలా బాగుందంటూ ఫోన్‌ చేశారు.

"మనం చేసిన సంగీతం ఎంత మందికి నచ్చితే అంత ఆనందం. కథని సృష్టించిన దర్శకులకి కూడా అంతే నచ్చిందంటే ఆ ఆనందం రెట్టింపవుతుంది. వాళ్లు ఆ కథతో కొన్నేళ్లుగా ప్రయాణం చేస్తుంటారు. చాలా ఊహించుకుంటూ సినిమా చేస్తారు. ఊహల్ని మించి వాస్తవం అరుదుగా జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో దర్శకుడిగా 'నేను చెప్పిన కథని నాకంటే బాగా అర్థం చేసుకుని పనిచేశారు' అని చెప్పారంటే ఆ మాట ఎంతో తృప్తినిస్తుంది. 'ఉప్పెన' విషయంలో అదే జరిగింది. 'సన్నాఫ్‌ సత్యమూర్తి' తర్వాత కూడా దర్శకుడు త్రివిక్రమ్‌ నేపథ్య సంగీతంతో సినిమాని చూశాక అల్లు అర్జున్‌కీ, నిర్మాతకీ ఫోన్‌ చేసి 'మనం రూపాయి సినిమా తీస్తే, దేవి 2 రూపాయల సినిమా చేసేశారు' అని చెప్పారు. 'ఉప్పెన'లో విజయ్‌ సేతుపతి పాత్రకి ఇచ్చిన నేపథ్య సంగీతం విన్నాక 'ఇక నుంచి ప్రేక్షకులు విజయ్‌ సేతుపతిని సెల్ఫీ అడగానికి కూడా భయపడతారేమో. నా సినిమానేనా అన్నట్టుగా ఉంది సర్‌' అంటూ కౌగిలించుకున్నారు దర్శకుడు బుచ్చిబాబు. అది నాకు దక్కిన మరో మంచి ప్రశంసగా అనిపించింది."

నా గుమ్మం అవతల ఏం జరుగుతుందో నేను పట్టించుకోను. దర్శకుడు వచ్చి ఒక కథ చెబితే, దానికి నిజాయతీగా పనిచేశానా లేదా? నా పని ఆ దర్శకుడికి సంతృప్తినిచ్చిందా? జనాలకి నచ్చిందా? ఇవి మాత్రమే ఆలోచిస్తా. ఆ విషయాల్లో నాకు సంతృప్తి లభించిందంటే చాలు... ఇంకేం పట్టించుకోను. ప్రస్తుతం రవితేజతో 'ఖిలాడి' చేస్తున్నా. పవన్‌కల్యాణ్‌-హరీష్‌శంకర్‌ కలయికలో సినిమా చేస్తున్నా. సూపర్‌గా ఉంటుంది. ఇప్పటికే ఓ పాట కూడా సిద్ధం చేసి వినిపించాం. చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.