ముద్దుగుమ్మ సయామీ ఖేర్.. 'రేయ్' చిత్రంతో తన కెరీర్ ప్రారంభించింది. తెలుగులోనూ అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఎక్కువగా బాలీవుడ్లోనే నటిస్తూ వచ్చింది. మళ్లీ ఐదేళ్ల తర్వాత టాలీవుడ్లోకి పునరాగమనం చేస్తోంది. కింగ్ నాగార్జున సరసన 'వైల్డ్ డాగ్'లో ఓ హీరోయిన్గా నటిస్తున్నానంది. ఓ సాహసోపేతమైన పాత్రలో నటిస్తున్నట్లు చెప్పింది.
"చాలా ఏళ్ల తర్వాత తెలుగులో సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాగార్జునతో నటించడం ఎంతో సంతోషంగా ఉంది. చిన్నప్పుడు స్కూల్లో ఎక్కువగా ఆటలు ఆడేదాన్ని. అందువల్ల నాకు యాక్షన్ చిత్రాల్లో నటించాలనే కోరిక ఎక్కువగా ఉండేది. 'వైల్డ్ డాగ్'తో అది నెరవేరింది. ఎప్పుడూ నటించనంత సాహసోపేతమైన చిత్రమిది. 'మీర్జా' సినిమాలో గుర్రం స్వారీ చేశా. కానీ ఇటువంటి పాత్ర ఎప్పుడూ చేయలేదు."
- సయామీ ఖేర్, నటి
అహిషోర్ సోలమన్ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'వైల్డ్ డాగ్'. ఎన్ఐఏ అధికారి విజయ్‌వర్మ ఉరఫ్ 'వైల్డ్‌డాగ్'గా కనిపించనున్నాడు నాగ్. ఈ సినిమా కోసం ముంబయిలో నెల రోజులు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నట్లు చెప్పింది సయామీ.
ఇదీ చదవండి: సూపర్‌స్టార్ రజనీ కొత్త సినిమా టైటిల్ ఇదేనా?