ETV Bharat / sitara

రకుల్‌ప్రీత్ పిటిషన్‌.. కేంద్రానికి కోర్టు నోటీసులు - రకుల్ ప్రీత్ సింగ్ వార్తలు

సుశాంత్ సింగ్ రాజ్​పుత్ మృతి కేసులో భాగంగా చేపడుతున్న విచారణలో డ్రగ్స్ కోణం బయటపడింది. దీంతో ఈ కేసును ఎన్సీబీ విచారిస్తోంది. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి విచారణలో నటి రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా వెల్లడైంది. ఫలితంగా ఆమెను కూడా ఎన్సీబీ ప్రశ్నించింది. అయితే కేసు విషయంలో తన పేరు మీడియాలో రాకూడదంటూ ఇటీవలే కోర్టును ఆశ్రయించింది రకుల్. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం, మీడియా నియంత్రణ సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

Delhi High Court issues notice to Centre on a plea by actor Rakul Preet Singh
రకుల్‌ పిటిషన్‌.. కేంద్రానికి కోర్టు నోటీసులు
author img

By

Published : Sep 29, 2020, 2:22 PM IST

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి కేసు విచారణలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌‌ కేసుకు సంబంధించి మీడియా తన పేరును ప్రస్తావించకూడదని కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఇటీవలే దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. డ్రగ్స్‌‌ కేసులో తనపై కథనాలు రాయకుండా/ప్రసారం చేయకుండా మీడియాకు ఆదేశాలు ఇవ్వాలని కోరింది. అలాంటి వార్తల వల్ల తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని పిటిషన్​లో పేర్కొంది. నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) విచారణ పూర్తి చేసి, నివేదికను తయారు చేసేంత వరకు తన పేరును ప్రస్తావించకూడదని విన్నవించింది. ఈ నేపథ్యంలో రకుల్‌ పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం, మీడియా నియంత్రణ సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

జూన్‌ 14న సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై అనుమానాలు ఉన్నాయంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అతడి ప్రియురాలు రియా చక్రవర్తిని విచారిస్తున్న క్రమంలో డ్రగ్స్‌‌ కోణం బయటపడింది. ఆమెతోపాటు మరికొందర్ని ఎన్సీబీ అరెస్టు చేసి విచారణ ముమ్మరం చేసింది. రియా స్టేట్‌మెంట్‌, ఆమె వాట్సాప్‌ చాటింగ్‌ల ఆధారంగా విచారణ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌. దీపికా పదుకొణె, సారా అలీ ఖాన్‌, శ్రద్ధా కపూర్‌లకు సమన్లు జారీ చేసింది. రెండు రోజుల క్రితం వీరంతా విచారణకు వెళ్లి వచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.