ETV Bharat / sitara

ఫిట్​నెస్​ ట్రైనర్​గా దీపికా పదుకొణె - movie news latest

తన కొత్త సినిమాలో సరికొత్తగా కనిపించేందుకు దీపికా పదుకొణె సిద్ధమవుతోంది. అనన్యకు అక్కగా నటించడం సహా వ్యాయామ శిక్షకురాలిగానూ సందడి చేయనుంది.

Deepika Padukone's role  in her next
దీపికా పదుకొణె
author img

By

Published : Apr 29, 2021, 6:21 AM IST

దీపికా పదుకొణె ఫిట్​నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. నిత్యం వర్కౌట్లు చేస్తూ శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంది. ఫిట్​నెస్​పై ఎంతో శ్రద్ధ కనబరిచే దీపిక.. వ్యాయమ శిక్షకురాలిగా తెరపై కనిపిస్తే పాత్రకు న్యాయం చేసినట్టే అవుతుందనే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.

శకున్ బత్రా దర్శకత్వంలో ఆమె ఓ చిత్రంలో నటిస్తోంది. సిద్ధాంత్ చతుర్వేది, అనన్యాపాండే ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. "ఫిట్​నెస్​పై శ్రద్ధ కనపరిచే అమ్మాయిగా, ఓ ఫిట్​నెస్ ఇన్​స్ట్రక్టర్​గా నటిస్తోంది" అని చిత్ర వర్గాలు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో దీపిక, అనన్య అక్కాచెల్లెళ్లుగా నటిస్తున్నారట.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.