ETV Bharat / sitara

'ప్రభాస్21' భామ​ వరల్డ్​ రికార్డు గురించి విన్నారా? - తాజా సినిమా వార్తలు

రెబల్​ స్టార్​ ప్రభాస్​- నాగ్​ అశ్విన్​ కాంబినేషన్​లో తెరకెక్కనున్న చిత్రంలో దీపికా పదుకొణె నటించనున్నట్లు ఖరారైంది. తాజాగా ఇందుకు సంబంధించి ప్రకటన కూడా చేసింది చిత్రబృందం. అయితే, ఈ ముద్దుగుమ్మ ఒక్కో సినిమాకు తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా?. బాలీవుడ్​లోనే అత్యధికంగా సంపాదిస్తున్న నటిగా గిన్నిస్​ వరల్డ్​ రికార్డుతో చరిత్ర సృష్టించిందీ నటి.

Deepika Padukone's Guinness World Record Might Leave You Stumped; Check Out
దీపిక గిన్నిస్​ వరల్డ్​ రికార్డు గురించి విన్నారా?
author img

By

Published : Jul 19, 2020, 6:24 PM IST

వెండితెరపై తన నటన, సోయగాలతో ప్రేక్షకులను కట్టిపడేయగల బాలీవుడ్​ నటి దీపికా పదుకొణె. ఆమె చేసిన సినిమాలెన్నో బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించాయి. తాజాగా రెబల్​ స్టార్​ ప్రభాస్​కు జోడీగా నటించేందుకు సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ. నాగ్​ అశ్విన్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో దీపికను హీరోయిన్​గా ప్రకటించింది చిత్రబృందం. అయితే, దీపిక ప్రతి సినిమాకు భారీ మొత్తంలో పారితోషికం తీసుకుందట. ఎంతలా అంటే.. బాలీవుడ్​లో అత్యధికంగా సంపాదిస్తున్న నటిగా గిన్నిస్​ వరల్డ్​ రికార్డ్ కూడా సృష్టించింది. వీటితో పాటు ఆమె కెరీర్​లోని మరెన్నో విశేషాలపై ఓ లుక్కేద్దాం రండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సంవత్సర ఆదాయం ఎంతంటే..

గిన్నిస్ వరల్డ్​ రికార్డ్ 2019 నివేదిక ప్రకారం దీపిక సంవత్సర ఆదాయం రూ. 112 కోట్లు. మరోవైపు ఫోర్బ్స్​ ఇండియా పత్రిక ప్రచురించిన వాటిలో.. అత్యధిక సంపాదన కలిగిన భారతీయ సెలబ్రిటీల జాబితాలో పదుకొణె నాల్గవ స్థానంలో ఉంది. 2018లో దీపిక నటించిన 'పద్మావత్'​ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. ఈ సినిమా రాజస్థాన్​ మహారాణి పద్మావతి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ భామ హాలీవుడ్​లో నటించిన 'త్రిబుల్​ ఎక్స్'​ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇందులో సెరెనా పాత్రలో నటించింది దీపిక.

సేవా తత్పరత..

దీపిక ఒక్కో సినిమాకు సుమారు రూ.10కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. మొత్తం అన్ని ఉత్పత్తుల ప్రకటనలకు కలిపి 8 కోట్ల వరకు తీసుకుంటుందని అంచనా. మరోవైపు దీపిక పదుకొణె నికర విలువ గత మూడేళ్లలో గరిష్ఠంగా 40శాతం పెరిగింది. ఆమె స్వచ్ఛంద సంస్థలకూ భారీ మొత్తంలో విరాళాలు ఇస్తుంటుంది. ఇటీవలే మహారాష్ట్రలో ఓ గ్రామాన్ని కూడా దత్తత తీసుకుని.. నిరంతర విద్యుత్​ సదుపాయం కల్పించింది.

దీపిక ప్రాజెక్టులు

దీపిక చివరగా మేఘనా గుల్జార్​ దర్శకత్వంలో వచ్చిన 'ఛపాక్'​ చిత్రంలో నటించింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ.. బాక్సాఫీసు వద్ద నిరాశ ఎదురైంది. త్వరలో దర్శకుడు శకున్​ బాత్రాతో కలిసి పని చేయనుందీ భామ. ఇప్పటికైతే ఈ సినిమా టైటిల్​ ఖరారు చేయలేదు. ఇందులో సిద్ధాంత్​ చతుర్వేది, అనన్య పాండే కూడా నటించనున్నారు. మరోవైపు రణ్​వీర్​ సింగ్​ చిత్రం '83'లో అతిథి పాత్రలో కనిపించనుంది. తాాజాగా 'ప్రభాస్​21' సినిమాలో హీరోయిన్​గా అవకాశం దక్కించుకుంది.

ఇదీ చూడండి:'కంగనకు ఉన్నంత ధైర్యం నాకు లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.