ETV Bharat / sitara

'83' సినిమాలో రోమీదేవ్​ లుక్​ అదుర్స్​ - deepika padukone news

భారత క్రికెట్‌ జట్టు 1983లో ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన చారిత్రక ఘట్టం నేపథ్యంలో తెరకెక్కిన బాలీవుడ్​ చిత్రం '83'. ఇందులో రణ్​వీర్​తో కలిసున్న దీపికా పదుకొణె లుక్​ను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం.

ranveer
'83' సినిమాలో దీపికా లుక్​ విడుదల
author img

By

Published : Feb 19, 2020, 12:30 PM IST

Updated : Mar 1, 2020, 8:05 PM IST

బాలీవుడ్​ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం '83'. భారత క్రికెట్‌ జట్టు 1983లో ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన చారిత్రక ఘట్టం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. అప్పటి జట్టుకు సారథ్యం వహించిన కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి కబీర్‌ ఖాన్‌ దర్శకుడు. ఇటీవలె ఈ సినిమా ఫస్ట్​లుక్​ను చెన్నైలో కమల్‌హాసన్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. అయితే తాజాగా రణ్​వీర్​తో కలిసున్న దీపికా పదుకొణె లుక్​నూ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది చిత్రబృందం. ఈ చిత్రంలో దీపికా... కపిల్​ దేవ్ భార్య రోమీదేవ్​ పాత్రలో కనిపించనుంది

ranveer
'83' సినిమాలో దీపికా లుక్​ విడుదల

తాజా లుక్​లో రణవీర్​, దీపికా ఒకరి కళ్లలో ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ కనిపించారు. దీపికా కేశాలంకరణ అదిరిపోయింది. ఈ లుక్​ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ranveer
కపిల్​-రోమీదేవి పోజులోనే రణ్​వీర్​-దీపికా

కోలీవుడ్​లో కమల్​హాసన్​, తెలుగులో నాగార్జున ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇది రణ్‌వీర్‌ సింగ్‌కు తొలి త్రిభాషా చిత్రంగా నిలవనుంది. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించిన ఈ సినిమా... హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఏప్రిల్​ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: సీనియర్​ ఎన్టీఆర్​ ఇంట్లో పుట్టా.. అలా నటన వైపు వచ్చా

Last Updated : Mar 1, 2020, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.