బాలీవుడ్ సూపర్‌హీరో హృతిక్ రోషన్ నటించిన 'క్రిష్' చిత్రం అప్పట్లో ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'క్రిష్2', 'క్రిష్3'లు ప్రేక్షకులను మెప్పించాయి. తాజాగా హృతిక్ తండ్రైన రాకేష్ రోషన్ దర్శకత్వంలో తెరకెక్కే 'క్రిష్4'లో కథానాయికగా దీపికా పదుకొణె నటించనుందని సమాచారం. గతంలో వచ్చిన సీక్వెల్ చిత్రాల్లో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించి మెప్పించింది.
రాకేష్ రోషన్ తన 'క్రిష్4'లో దీపికా పదుకొణెను కథానాయికగా తీసుకోవడానికి మొగ్గుచూపుతున్నాడట. అయితే ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. ఇప్పటి వరకు దీపికా - హృతిక్‌లు కలిసి నటించిన చిత్రం ఒక్కటీ కూడా లేదు. అందుకే హృతిక్ - దీపికాల కాంబినేషన్ ఒక్కసారైనా తెరపై చూడాలని బాలీవుడ్ ప్రేక్షకులు కోరుకుంటున్నారట.
హృతిక్ గతేడాది 'సూపర్ 30', 'వార్'లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి ఈ ఏడాదిలో ఎటువంటి కొత్త ప్రాజెక్ట్‌ను చేపట్టలేదు. దీపికా తన భర్త రణ్వీర్ సింగ్‌తో కలిసి '83'లో నటిస్తోంది. ఈ చిత్రం తరువాత దీపికా కూడా కొత్త చిత్రాలు చేస్తున్నట్లు సమాచారం లేదు.
ఇవీ చూడండి.. అలాంటి కథ దొరికితే బన్నీ బాలీవుడ్ ఎంట్రీ..!