బాలీవుడ్లో తెరకెక్కుతున్న బయోపిక్ 'ఛపాక్'ను తొలి నుంచి గమనిస్తున్న వారికి ఇప్పటికీ ఓ సందేహం అలానే ఉండిపోయింది. ఈ సినిమాకు మూలమైన యాసిడ్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ ఎక్కడా? అని. వాటికి తెరదించుతూ ఆమె ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముంబయిలో శుక్రవారం జరిగిన 'ఛపాక్' టైటిల్ ట్రాక్ ఆవిష్కరణలో సందడి చేశారు లక్ష్మి. అయితే ఈ పాటను వేదికపై శంకర్ మహదేవన్ పాడుతుండగా ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. పక్కనే ఉన్న దీపిక.. లక్ష్మిని ఓదార్చారు.
-
THIS!!😭❤#ChhapaakTitleTrack pic.twitter.com/t76D5tH27j
— Sunshine | Chhapaak (@DeepikaSunshine) January 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">THIS!!😭❤#ChhapaakTitleTrack pic.twitter.com/t76D5tH27j
— Sunshine | Chhapaak (@DeepikaSunshine) January 3, 2020THIS!!😭❤#ChhapaakTitleTrack pic.twitter.com/t76D5tH27j
— Sunshine | Chhapaak (@DeepikaSunshine) January 3, 2020
ఇందులో లక్ష్మి పాత్రలో దీపిక పదుకొణె కనిపించనుంది. యాసిడ్ దాడికి గురైన ఓ అమ్మాయి.. సమాజంలో ఎదుర్కొన్నఅనుభవాలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలే ఈ చిత్ర కథాంశం. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: ట్రైలర్ చూస్తూ భావోద్వేగం.. దీపిక కన్నీటి పర్యంతం