బాలీవుడ్ భామ దీపికా పదుకొణె.. భర్త రణ్వీర్ సింగ్‌తో కలిసి నటించేందుకు మరోసారి సిద్ధమైంది. రోహిత్‌శెట్టి దర్శకత్వం వహిస్తున్న 'సర్కస్'లో కీలక పాత్రతో పాటు ప్రత్యేక గీతం కోసం ఆమెను సంప్రదించారట. దీనికి ఆమె అంగీకారం కూడా తెలిపినట్లు సమాచారం.
విలియమ్ షేక్స్పియర్ 'ద కామెడీ ఆఫ్ ఎర్రర్స్' నాటకం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. ప్రస్తుతం ముంబయిలో షూటింగ్ జరుగుతోంది. పూజాహెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లు. ఈ ఏడాది శీతాకాలంలో చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు.
రణ్వీర్-దీపిక.. పెళ్లికు ముందు రామ్‌లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ సినిమాల్లో నటించారు. వివాహం అనంతరం '83'లో ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు 'సర్కస్' కోసం కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇది చదవండి: విలన్ అవతారంలో దీపిక.. నిజమేనా?