'ఛపాక్' చిత్రబృందం ఓ వినూత్న ప్రయోగం చేసింది. యాసిడ్ దాడి బాధితుల పట్ల సమాజం తీరు ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ప్రయత్నించింది. సినిమాలో ప్రధాన పాత్ర పోషించి దీపికా పదుకొణెతో యాసిడ్ బాధితురాలి వేషధారణలో దిల్లీ వీధుల్లోకి పంపించింది.
ఈ వీడియోను దిల్లీలోని కొన్ని దుకాణాల్లో రహస్య కెమెరాలు ఉంచి చిత్రీకరించారు. సినిమాలో ఎలా కనిపిస్తుందో అదే విధంగా సిద్ధమై, పలువురు యాసిడ్ దాడి బాధితులతో కలిసి షాపింగ్‌కు వెళ్లింది దీపిక. అదే సమయంలో ఆయా దుకాణాల్లో ఉన్న కొందరు వీరిని చూసి చిరాకు పడ్డారు. విసుగు తెచ్చుకున్నారు. కొందరు స్నేహంగా పలకరించారు. ఈ వీడియోను నెట్టింట షేర్ చేసింది చిత్ర బృందం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
దీపికను చూస్తే భారీ సంఖ్యలో సెల్ఫీలంటూ గుమిగూడే జనం బాధితురాలిగా కనిపించినపుడు.. పట్టించుకోకపోవడం గమనార్హం.
యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితాధారంగా తెరకెక్కిందీ చిత్రం. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చదవండి: 'రాకీ భాయ్'కు వినూత్న రీతిలో బర్త్‌డే విషెస్