సెలబ్రిటీల రోజువారీ జీవితంలో బాడీగార్డ్స్ ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంటారు. తారలు బయట ప్రపంచంలోకి అడుగుపెట్టాలంటే వాళ్లు తప్పనిసరి. సినిమా ఫంక్షన్లు, పబ్లిక్ మీటింగులు, షికార్లు.. ఇలా ఎక్కడికి వెళ్లినా సరే అంగరక్షకులు వారి వెన్నంటే ఉంటారు. అందుకే కొంతమంది సెలబ్రిటీలు వీరిని సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తుంటారు. వారు అందించే రక్షణకు తగ్గట్టుగానే జీతాలు అందుకుంటారు. అయితే బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె బాడీగార్డ్ జీతం గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే! అతడి జీతం సంవత్సరానికి సుమారు కోటి రూపాయలు.
సొంత అన్నలా
దీపికా పదుకొణె పర్సనల్ బాడీగార్డ్ పేరు జలాల్. ఎన్నో సంవత్సరాల నుంచి దీపికకు సంరక్షకుడిగా వ్యవహరిస్తున్నారు. దీపిక బయటకు వచ్చిందంటే ఆమె వెనుకే దర్శనమిస్తాడు. ఆమె నటించిన హాలీవుడ్ సినిమా 'ట్రిపుల్ ఎక్స్' ప్రమోషన్ సమయంలో జలాల్ ఫొటోలు బయటకు వచ్చాయి. తనని అంతగా సంరక్షిస్తున్న జలాల్‌ను దీపిక ఓ సోదరుడిలా చూసుకుంటారు. ప్రతి ఏటా రాఖీ కడతారు.
2017 ముందు వరకూ జలాల్ వార్షిక జీతం రూ.80లక్షలు. తాజా సమాచారం ప్రకారం ఇటీవల దీపిక అతడి జీతాన్ని పెంచారని సమాచారం. ఈ మేరకు ప్రస్తుతం ఆయన వార్షిక జీతం రూ.కోటి. రూపాయలని తెలుసుకొని అంతా షాక్ అవుతున్నారు.
ఇదీ చూడండి: