ETV Bharat / sitara

యూట్యూబ్​లో 'డియ‌ర్ కామ్రేడ్‌', 'మ‌జిలీ' హ‌వా

author img

By

Published : Jun 17, 2021, 6:46 PM IST

క్రికెట్​ నేపథ్యంతో తెరకెక్కిన టాలీవుడ్​ చిత్రాలు బాలీవుడ్​లోనూ సూపర్​హిట్​గా నిలిచాయి. ఇప్పుడదే కోవలో తెలుగు తెరకెక్కిన 'డియర్​ కామ్రేడ్​'(Dear Comrade), 'మజిలీ'(Majili) చిత్రాలు హిందీ ప్రేక్షకుల మెప్పును పొందుతున్నాయి. ఈ రెండు చిత్రాల హిందీ వెర్షన్లకు యూట్యూబ్​లో విశేష స్పందన లభిస్తోంది.

Dear Comrade and Majili hindi dubbed version youtube records
యూట్యూబ్​లో 'డియ‌ర్ కామ్రేడ్‌', 'మ‌జిలీ' హ‌వా

తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించిన చిత్రాలు రీమేక్ రూపంలోనూ, డ‌బ్బింగ్ ద్వారానో హిందీ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవుతుంటాయి. అలా హిందీలోకి డ‌బ్ అయిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'మ‌జిలీ' చిత్రాలు యూట్యూబ్‌లో హ‌వా కొన‌సాగిస్తున్నాయి. 2020 ఫిబ్ర‌వ‌రి 7న యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన 'మ‌జిలీ' 100 మిలియ‌న్‌కి (10 కోట్లు) పైగా వీక్ష‌ణ‌లు సొంతం చేసుకుంది.

మరోవైపు 2020 జ‌న‌వ‌రి 19న అప్‌లోడ్ అయిన 'డియ‌ర్ కామ్రేడ్' 250 మిలియ‌న్‌కి (25 కోట్లు) పైగా వ్యూస్ ద‌క్కించుకుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక ప్ర‌ధానపాత్ర‌ల్లో ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ 'డియ‌ర్ కామ్రేడ్‌'ని తెర‌కెక్కించారు. నాగ చైత‌న్య‌, స‌మంత జంట‌గా 'మ‌జిలీ'ని తెర‌కెక్కించారు శివ నిర్వాణ‌. ఈ రెండు సినిమాలు క్రికెట్ నేప‌థ్యంలోనే రూపొందాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి.. యూట్యూబ్​లో 'ఇస్మార్ట్​ శంకర్​'కు రికార్డ్ వ్యూస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.