ETV Bharat / sitara

'రొమాంటిక్ పాత్రలకు సరిపోనేమో అనుకున్నా!'

బాలీవుడ్​ బాద్​షా షారుఖ్ ఖాన్​కు లవర్​బాయ్​ ఇమేజ్​ తెచ్చిపెట్టిన చిత్రం 'దిల్​వాలే దుల్హానియా లేజాయేంగే'. ఈ సినిమాతో షారుఖ్.. ​ ప్రేమకథలకు ఓ సరికొత్త ఇమేజ్​​ను తీసుకువచ్చాడు. అయితే ఇప్పటికీ రొమాంటిక్​ పాత్రలకు తాను సరిపోననే అనుకుంటున్నాడు కింగ్ ఖాన్.

DDLJ turns 25: King of Romance always felt he wasn't cut out to play romantic character
'రొమాంటిక్​ సన్నివేశాల్లో నటించడానికి నేను సరిపోనేమో!'
author img

By

Published : Oct 20, 2020, 5:33 PM IST

'దిల్​వాలే దుల్హానియా లేజాయేంగే'.. బాలీవుడ్​ ప్రేమకథల్లో క్లాసిక్​ ముద్రను సొంతం చేసుకున్న సినిమా. షారుఖ్​, కాజోల్​ జంటగా నటించిన ఈ చిత్రం.. నేటితో పాతిక వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంతో మహిళా ప్రేక్షకులకు షారుఖ్​.. ఎంతో దగ్గరయ్యాడు. రొమాంటిక్​ చిత్రాల్లో నటించాలంటే.. తన తర్వాతే ఎవరైనా అనే పేరు దక్కించుకున్నాడు. కానీ, తాను రొమాంటిక్​ పాత్రల్లో నటించడానికి ఎప్పటికీ సరిపోనేమో అని అంటున్నాడు షారుఖ్.

"అప్పటి కథానాయకులతో పోల్చుకుంటే నేను చాలా అసహజంగా ఉన్నానని అనిపించేది. అందరితో నేను ఈ విషయాన్ని చెప్పేవాడిని. అందంగా లేకపోవడం వల్ల అలా అనిపించేదేమో! అలాగే అందరూ నన్ను చాకోలెటీ అని పిలిచేవారు. దానివల్ల.. రొమాంటిక్​ సన్నివేశాల్లో నటించడానికి నేను సరిపోనేమో అనుకునేవాడిని. లేడీస్​తో వ్యవహరించడంలోనూ నేను కాస్త మొహమాటస్తుడిని. నాకైతే తెలియదు. నేను కాజోల్​తో కలిసి ఆ ప్రేమ సన్నివేశాల్లో ఎలా నటించగలిగానో!"

-షారుఖ్​ ఖాన్, హీరో​

DDLJ turns 25: King of Romance always felt he wasn't cut out to play romantic character
'డీడీఎల్​జే'లో షారుఖ్​, కాజోల్​

1995, అక్టోబర్​ 20లో 'దిల్​వాలే దుల్హానియా లేజాయేంగే' చిత్రం ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. బాలీవుడ్​లో చెరిగిపోని రికార్డులను సృష్టించింది.

ఇదీ చూడండి:డీడీఎల్​జే@25: ప్రేమికులంటే గుర్తొచ్చేది షారుక్​, కాజోల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.