సూపర్‌స్టార్ రజనీకాంత్.. 'దర్బార్' మోషన్ పోస్టర్‌తో అదరగొట్టాడు. అనిరుధ్ సంగీతమందించిన ఈ వీడియోలో మాస్ బీట్.. ప్రేక్షకుల్ని అలరిస్తోంది. తలైవా.. తలైవా అంటూ సాగుతున్న లిరిక్స్ సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి.
ఈ మోషన్ పోస్టర్‌ను ప్రముఖ హీరోలైన మహేశ్‌బాబు(తెలుగు), కమల్‌హాసన్(తమిళం), మోహన్‌లాల్(మలయాళం), సల్మాన్‌ఖాన్(హిందీ) విడుదల చేశారు.
ఈ సినిమాలో నయనతార హీరోయిన్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి: అమితాబ్ 50 ఏళ్ల నట ప్రస్థానం.. అభిషేక్ భావోద్వేగం