ETV Bharat / sitara

నాలుగు భారతీయ భాషల్లో.. జేమ్స్​ బాండ్​ 'నో టైమ్​ టు డై'

author img

By

Published : Sep 2, 2020, 6:43 PM IST

'జేమ్స్​ బాండ్'​ సిరీస్ నుంచి వస్తోన్న 'నో టైమ్​ టు డై' చిత్రాన్ని.. ఇంగ్లీష్​తో పాటు హిందీ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. ఇప్పటికే డ‌బ్బింగ్ కూడా పూర్తవగా.. నవంబరులో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది.

No Time To Die
నో టైమ్​ టు డై

ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినీ ప్రేక్షకులకు.. 'జేమ్స్​ బాండ్'​​ సిరీస్​ 'నో టైమ్​ టు డై' చిత్రబృందం తీపి కబురు అందించింది. ఈ సినిమాను ఇంగ్లీష్​తో పాటు హిందీ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. అన్ని భాషల డ‌బ్బింగ్ పనులు పూర్తయిపోయినట్లు వెల్లడించింది. అంతా అనుకున్నట్లు జరిగితే నవంబరులో థియేటర్లలోనే సందడి చేయనుందీ సినిమా. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్​ సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది.

చివరిసారి బాండ్​ పాత్రలో...

2005 నుంచి తెరకెక్కిన బాండ్​ సిరీస్​ చిత్రాల్లో డేనియల్​ క్రెగ్​ తనదైన శైలిలో నటించి మెప్పించారు.​ బాండ్‌ సిరీస్‌లో 25వ సినిమాగా 'నో టైమ్‌ టు డై' తెరకెక్కింది. ఈ చిత్రంలో చివరిసారిగా బాండ్​ పాత్రలో అలరించనున్నారు క్రెగ్.

ఈ చిత్రానికి కెరీ జోజి దర్శకత్వం వహించారు. హాలీవుడ్​ ప్రముఖ నటీనటులు బెన్​ విక్షా, నామి హ్యారిస్​, రాల్ఫ్​ ఫిన్నెస్​, లి సైడక్స్​, జెఫ్రి వ్రైట్​, రమి మాలెక్​, లషనా లించ్​ తదితరులు కనువిందు చేయనున్నారు. మెట్రో గోల్డ్ విన్ మేయర్, ఇయోన్ ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.

కథా సారాంశం

కిడ్నాప్‌కు గురైన ఓ సైంటిస్ట్‌ను కాపాడేందుకు జేమ్స్‌బాండ్‌ను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఆ తర్వాత జరిగిన సంఘటనే ఈ సినిమా కథ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇది చూడండి 'అగ్ర హీరోలు అందుకే నాతో సినిమాకు ఓకే చెప్తారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.