మన దేశంలోని పలు భాషలకు చెందిన నటీనటులు హాలీవుడ్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. అయితే 'జేమ్స్ బాండ్' ఫేమ్ డేనియల్ క్రెయిగ్ మాత్రం హిందీ సినిమా కోసం గతంలో ఆడిషన్ ఇచ్చాడట. ఈ విషయాన్ని 'రంగ్ దే బసంతి' చిత్ర దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా వెల్లడించారు. ఈ విషయానాన్ని తన బయోగ్రఫీలో రాసుకొచ్చారు.
"భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌ను ఉరి తీయడానికి నడిచే యువ జైలర్ జేమ్స్ మెక్‌కిన్లీ పాత్ర కోసం ఓ వ్యక్తిని ఆడిషన్ చేశాను. అది ఎవరో కాదు ప్రస్తుత జేమ్స్ బాండ్ డేనియల్ క్రెయిగ్. ఈ పాత్రకు అతడినే తీసుకోవాలనేది నా తొలి ప్రాధాన్యత. కానీ అతడు తన జేమ్స్‌బాండ్ సినిమా కోసం ఈ పాత్రలో నటించడానికి కాస్త సమయం కావాలని కోరాడు. కానీ ఆ తర్వాత స్టీవెన్ మాకిన్‌తోష్(Steven Mackintosh)ను తీసుకున్నాం"
-ఓం ప్రకాశ్‌మెహ్రా, దర్శకుడు
ఆమిర్ ఖాన్, సిద్ధార్ధ్, మాధవన్ కలయికలో వచ్చిన 'రంగే దే బసంతి'.. 2006లో విడుదలై విశేషాదరణ సొంతం చేసుకుంది. రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహించిన 'తుఫాన్'.. ఓటీటీ వేదికగా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. మిశ్రమ స్పందనలు అందుకుంది. ఇందులో ఫర్హాన్ అక్తర్ బాక్సర్ కనిపించి, ఆకట్టుకున్నాడు.
ఇదీ చూడండి: నియా శర్మ.. అందాల్ని అస్సలు దాచుకోవట్లేదుగా!