స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కూతురు అర్హకు సంబంధించిన మరో వీడియో ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. ఇందులో ఆ చిన్నారితో తనకు ఇష్టమైన రంగు గురించి అడిగిన బన్నీ.. తనను బే అని పిలవగా.. అర్హ, తండ్రిని బే అంది.
బన్నీ: నీ ఫేవరెట్ కలర్ ఏంటి బే?
అర్హ: పింక్ బే
బన్నీ: నన్ను బే అంటావా బే.. (ఆశ్చర్యంగా)
అర్హ: అవును బే (నవ్వుతూ)
బన్నీ: అ.. టు టైమ్స్ బే అంటావా బే
అర్హ: అవున్ బే
బన్నీ: త్రీ టైమ్స్.. సొంత ఫాదర్‌ను, కన్నతండ్రిని ఇన్నిసార్లు బే అంటావా బే
అర్హ: అవును బే
బన్నీ: మళ్లీ బే.. నీకు అసలు భయం ఉందా బే
అర్హ: లేదు బే
బన్నీ: మళ్లీ బే అంటావా నన్ను
ఈ సంభాషణకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పంచుకుంటూ.. 'తనే నా బే.. ఫాదర్ డాటర్ లవ్, జస్ట్ ఫర్ ఫన్' అనే సందేశాన్ని జోడించాడు బన్నీ. ఇది ఇప్పుడు వైరల్గా మారింది.
తండ్రి స్టెప్పు దోశ స్టెప్పు
గతంలోనూ 'రాములో రాములా' పాటలో బన్నీ వేసింది దోశ స్టెప్పంటూ ముద్దు ముద్దుగా చెప్పి ఆకట్టుకుంది అర్హ. ఆ వీడియోను అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'అల వైకుంఠపురములో' ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు బన్నీ. రష్మిక హీరోయిన్గా కనిపించనుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చదవండి: శేష్ 'మేజర్' కోసం మళ్లీ ఆ హీరోయిన్