ETV Bharat / sitara

సమంత సినిమాలో క్రికెటర్​ శ్రీశాంత్​.. రిలీజ్​ డేట్​తో 'పృథ్వీరాజ్​' - Akshay kumar Prithviraj release date announced

Cinema Updates: కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో విజయ్​సేతుపతి, సమంత, అక్షయ్​కుమార్​, యామీ గౌతమ్​, మాధురీదీక్షిత్​ చిత్రాల సంగతులు ఉన్నాయి.

Cricketer sreesanth in Samantha movie
సమంత సినిమాలో క్రికెటర్​ శ్రీశాంత్
author img

By

Published : Feb 10, 2022, 4:11 PM IST

Cricketer Sreesanth Samantha: విజయ్ సేతుపతి, సమంత, నయనతారలు ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'కాతువాకుల రెండు కాదల్'. ఈ సినిమాలో క్రికెటర్​ శ్రీశాంత్​ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపింది చిత్రబృందం. మహ్మద్​ మోబీగా అతడిని పరిచయం చేస్తూ ఓ పోస్టర్​ను రిలీజ్​ చేసింది. ఈ పోస్టర్​ ప్రస్తుతం వైరల్​గా మారింది. ఈ మూవీకి విఘ్నేశ్​ దర్శకుడు. అనిరుధ్‌ రవిచందర్ సంగీత సమకూరుస్తున్నాడు.

Cricketer Sreesanth Samantha
సమంత సినిమాలో క్రికెటర్​ శ్రీశాంత్​

Akshay kumar Prithviraj movie: బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​కుమార్ నటించిన కొత్త సినిమాల్లో 'పృథ్వీరాజ్' ఒకటి. ఎట్టకేలకు ఈ చిత్రం​ విడుదల తేదీని ఖరారు చేసుకుంది. జూన్​ 10న రిలీజ్​ కానున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఇందులో అక్షయ్​తో పాటు మానుషీ చిల్లర్​, సంజయ్​ దత్​, సోనూ సూద్​ కీలక పాత్రల్లో నటించారు. చంద్రప్రకాశ్​ ద్వివేది దర్శకత్వం వహించారు.

prithviraj
రిలీజ్​ డేట్​తో 'పృథ్వీరాజ్​'

Yamigautham new movie: యామీ గౌతమ్‌, అతుల్‌ కులకర్ణి, నేహా ధుపియా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ఏ థర్స్‌డే'. బేహ్‌జాద్‌ ఖంబాటా దర్శకత్వం వహించారు. ఈ సినిమా నేరుగా ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 17నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ను గురువారం విడుదల చేసింది. ఓ గురువారం జరిగే అనూహ్య సంఘటనల నేపథ్యంలో ఈ థ్రిల్లర్‌ చిత్రం రూపొందినట్టు తెలుస్తోంది. ప్లే స్కూల్‌ టీచర్‌ అయిన యామీ తన విద్యార్థుల్ని నిర్భంధించి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసే సన్నివేశాలు ఉత్కంఠ పెంచేలా ఉన్నాయి. టీచర్‌గా యామీ, పోలీసు ఆఫీసర్‌గా నేహాధుపియా అందరినీ ఆకట్టుకునేలా ఉన్నారు. రోనీ స్క్రూవాలా, ప్రేమ్‌నాథ్‌ రాజగోపాలన్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో డింపుల్‌ కపాడియా, కరణ్‌వీర్‌ శర్మ తదితరులు అతిథి పాత్రలు పోషించారు. ఈ సినిమాకి రోషన్​ దలాల్​ సంగీతమందించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Madhuri Dixit new movie: బాలీవుడ్​ అందాల భామ మాధురీ దీక్షిత్​ నటించిన తొలి వెబ్​సిరీస్​ 'ది ఫేమ్​ గేమ్​' ఫిబ్రవరి 25 నుంచి నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్​ కానుంది. ఇందులో సంజయ్​ కపూర్​, మానవ్ కౌల్​, సుహాసినిములె కూడా నటించారు. బీజాయ్​ నంబీయార్​ దర్శకత్వం వహించారు. ​

ఇదీ చూడండి: షూటింగ్​లో శివకార్తికేయన్.. కంగన 'లాక్ అప్' ఫస్ట్​లుక్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.