ETV Bharat / sitara

'కొవిడ్ ప్రొటెక్షన్ సిస్టమ్'తో సినిమా​ షూటింగులు​ - prabhas radheshyam

తెలుగు చిత్రపరిశ్రమలో 24 శాఖలకు తోడుగా 'కొవిడ్ ప్రొటెక్షన్ సిస్టమ్' అనే కొత్త శాఖను ప్రవేశ పెట్టనున్నారు. ఇందులో భాగంగా కరోనా రాకుండా పూర్తిజాగ్రత్తలు తీసుకోనున్నారు. ప్రభాస్ 'రాధేశ్యామ్'తో దీనిని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

'కొవిడ్ ప్రొటెక్షన్ సిస్టమ్'తో సినిమా​ షూటింగులు​
టాలీవుడ్​లో కొత్త సిస్టమ్
author img

By

Published : Jul 13, 2020, 6:27 AM IST

ప్రతి ఓటమి.. విజయానికి సరికొత్త మార్గాలను అన్వేషించేలా చేస్తుంది. ప్రతి విపత్తు.. వినూత్న ఆవిష్కరణలకు నాంది పలికేందుకు దోహదపడుతుంది. కరోనా పరిస్థితులతో కళ తప్పిన చిత్ర పరిశ్రమ.. తిరిగి గాడిన పడేందుకు ఈ తరహాలోనే కొత్త దారులు వెతుక్కుంటోంది. ఇప్పుడీ వెతుకులాట నుంచే సినీ పరిశ్రమలో ఓ కొత్త విభాగం పురుడుపోసుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే 'కొవిడ్‌ ప్రొటెక్షన్‌ సిస్టమ్‌' (సీపీఎస్‌). మరి చిత్ర పరిశ్రమలో సరికొత్తగా మొగ్గ తొడుగుతోన్న ఈ కొత్త విభాగం ఏంటి? దాని పనితీరు ఏంటో తెలుసుకుందామా!

కరోనా దెబ్బకు రంగుల తెర చిన్నబోయి అప్పుడే ఐదు నెలలు పూర్తి కావొస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు చిత్ర పరిశ్రమలోని 24 విభాగాలు స్తంభించిపోయాయి. కోట్ల రూపాయల నష్టం.. రోడ్డున పడ్డ లక్షలాది మంది కార్మికులు.. వినోదాలకు దూరమైన సినీ ప్రేమికులు.. ఇలా కరోనాతో వెండితెరను వెంటాడుతోన్న కష్టాలెన్నెన్నో. సినీ రంగాన్ని గాడిన పెట్టేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు కొన్ని ఆంక్షలతో చిత్రీకరణలకు అనుమతులిచ్చినా.. ధైర్యంగా సెట్స్‌పైకి వెళ్లిన పెద్ద చిత్రమేదీ లేదు. కొన్ని చిన్న చిత్ర బృందాలు ధైర్యం చేసి చిత్రీకరణలు మొదలు పెట్టినా.. ఎప్పుడెలాంటి పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందోనన్న భయాందోళనలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సురక్షిత వాతావరణంలో చిత్రీకరణలు కొనసాగించేందుకు కొన్ని బడా నిర్మాణ సంస్థలు 'కొవిడ్‌ ప్రొటెక్షన్‌ సిస్టమ్‌' పేరుతో ఓ కొత్త విభాగాల్ని ఏర్పాటు చేసుకున్నాయని తెలుస్తోంది. ఒకవేళ ఇది విజయవంతమైతే.. 24 విభాగాలతో కళకళలాడిన చిత్ర పరిశ్రమకు ఇది 25వ విభాగంగా మారే అవకాశముంది.

అసలేంటి ఈ 'సీపీఎస్‌'?

ఇండోర్‌, అవుట్‌డోర్‌లలో జరిగే షూటింగ్స్‌కు సంబంధించిన పూర్తి రక్షణ చర్యలను బాధ్యతగా తీసుకోవడం 'కొవిడ్‌ ప్రొటెక్షన్‌ సిస్టమ్‌' ప్రధాన విధి. అంటే చిత్రీకరణ మొదలుకావడానికి ముందు నుంచి షూటింగ్‌ పూర్తయ్యి నటీనటులు, సిబ్బంది అంతా సెట్‌ విడిచే వరకు 'కొవిడ్‌ - 19' బారిన పడకుండా రక్షణ కల్పిస్తుంది. ఇందుకోసం ప్రపంచ ఆరోగ్యసంస్థ, 'కొవిడ్‌-19' మార్గదర్శకాలకు అనుగుణంగా సెట్లో అన్ని రకాల రక్షణాత్మక ఏర్పాట్లను చేస్తుంది.

'రాధేశ్యామ్‌' ఈ పద్ధతిలోనే!

ప్రభాస్‌ హీరోగా నటిస్తోన్న 'రాధేశ్యామ్‌' చిత్రాన్ని ఆగస్టు నుంచి సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. పాన్‌ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్‌తో గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఇప్పుడు దీనికి 'కొవిడ్‌ ప్రొటెక్షన్‌ సిస్టమ్‌'ను అమలుచేయడానికి ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రభాస్‌ చిత్ర బృందం ఇప్పటికే ఓ డెమో వీడియోను తయారు చేసుకుందని సమాచారం. త్వరలో షూటింగ్‌ ప్రారంభించుకోనున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'ఆచార్య', 'పుష్ప' చిత్ర బృందాలు ఈ విభాగాలనే నియమించుకోవాలని యోచిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

cinema shooting in tollywood
టాలీవుడ్​ సినిమా షూటింగ్

కెమెరాలు, క్యాస్టూమ్స్‌ ఎలా?

చిత్రీకరణ ప్రదేశాల్లో వినియోగించే చిన్న చిన్న వస్తువుల నుంచి పెద్ద పరికరాలు, దుస్తులు, ఇతర పరికరాలను శానిటైజ్‌ చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటారు. దీనిలో భాగంగా అతినీలలోహిత కిరణాలతో వైరస్‌ను చంపేలా డిజైన్‌ చేసిన బాక్స్‌లలో వస్తువులు, దుస్తులను నిర్ణీత సమయం వరకు ఉంచి శుభ్రపరుస్తారు. సెట్‌కు వచ్చిన వాహనాలను హైపో క్లోరైడ్‌ ద్రావణంతో శానిటైజ్‌ చేస్తారు. కెమెరాలు, సెల్‌ఫోన్‌ లాంటి వాటిని ఫాగింగ్‌ పద్ధతిలో శుభ్రపరిచేందుకు బాక్స్‌లు సిద్ధం చేస్తారు.

ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

  1. షూటింగ్‌ ప్రారంభం కావడానికి ముందే దర్శక నిర్మాతలు చెప్పిన సెట్‌కు చేరుకొని.. చిత్రీకరణ జరగనున్న లొకేషన్‌ లేదా సెట్‌ను పూర్తిగా హైపోక్లోరైడ్‌ ద్రావణంతో శానిటైజ్‌ చేస్తారు.
  2. ప్రతిఒక్కరి శరీర ఉష్ణోగ్రత, తదితర వివరాలను ఫొటోలు సహా రికార్డు చేస్తారు. సెట్‌లో ప్రతిఒక్కరి ఆరోగ్య స్థితిని, వారి కదలికల్ని తెలుసుకోగలిగే కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు.
  3. చిత్రీకరణ జరుగుతున్నంత సేపు ఆ ప్రదేశంలో ఓ వైద్యుడిని, అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచుతారు.
  4. చిత్రీకరణ జరిగినన్ని రోజులూ నటీ నటులు, ఇతర సిబ్బందికి వారానికి ఒకసారి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తారు. కొత్తగా ఎవరైనా అడుగు పెట్టినా వాళ్లకూ ఈ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తారు.
  5. కరోనా నుంచి రక్షణ కల్పించుకునేందుకు అత్యున్నత ప్రమాణాలతో తయారు చేసిన మాస్క్‌లు, శానిటైజర్లు అందిస్తారు. అవసరమైన ప్రదేశాల్లో ఫేస్‌ షీల్డ్స్‌ కూడా అందిస్తారు.
  6. షూటింగ్‌ పని పూర్తయ్యాక అందులో వినియోగించిన 'కొవిడ్‌ - 19' మెటీరియల్‌ అంతటినీ నిర్ణీత ప్రమాణాల మేరకు బూడిద చేస్తారు.
  7. ఈ పనులన్నింటినీ నలుగురైదు మంది సిబ్బందితోనే నిర్వహిస్తారు. వీరి రక్షణకు తగిన జాగ్రత్తలు చేపడతారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.